IG Satyanarayana: సంగారెడ్డి జిల్లా జిన్నారం లోని శివుని విగ్రహాన్ని వేరే వర్గం వారు కూల్చేదని మల్టీ జోన్ ఐజి సత్యనారాయణ స్పష్టం చేశారు.సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.శివుని విగ్రహాన్ని వేరే వర్గం వారు కూల్చేదని,అటు వైపు నుంచి వచ్చిన ఓ వర్గం వారు,రావడంతో మరో వర్గం వారు తప్పుగా బావించి,మరో వర్గానికి చెందిన ఆస్తులపై దాడి చేశారని చెప్పారు.వాస్తవాలు తెలుసుకోకపోవడంతో ఈ ఘర్షణ జరిగిందని ఐజి సత్యనారాయణ వివరించారు.
ఆరు నెలల క్రితం సదాశివపేట లో ఓ గుడిలో ఆవులు విగ్రహాన్ని ధ్వంసం చేస్తే తప్పుడు ప్రచారం చేశారని వివరించారు.సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐజి సత్యనారాయణ హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ,వికారాబాద్ ఎస్పీ,నారాయణ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు