Rythu Mahotsavam(image credit:X)
నిజామాబాద్

Rythu Mahotsavam: పండుగను తలపించిన రైతు మహోత్సవం వేడుక!

Rythu Mahotsavam: రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 21 నుండి మూడు రోజుల పాటు నిర్వహించిన రైతు మహోత్సవం వేడుక బుధవారం సాయంత్రం నాటితో ముగిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేయగా, నిజామాబాద్ తో పాటు కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల ఐదు జిల్లాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పండుగ వాతావరణం కనిపించింది.

వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన 130 కు పైగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రైతులు, వారు పండించిన ఉత్పత్తులతో పాటు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులను, ఆధునిక సాగు పరికరాలు, అధిక దిగుబడులను అందించే వంగడాలు, మేలు జాతి పాడిపశువులు తదితర వాటిని స్టాళ్లలో ప్రదర్శించగా, రైతులు ఎంతో ఆసక్తితో తిలకించారు.

వ్యవసాయ, ఉద్యాన‌వ‌న‌, ప‌శుసంవ‌ర్ధ‌క‌, మ‌త్స్య శాఖ శాస్త్రవేత్తలు, నిపుణులు, వ్య‌వ‌సాయ‌ అనుబంధ శాఖ‌ల అధికారులు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన యూనివర్సిటీ, ఇతర వ్యవసాయ పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు మూడు రోజుల పాటు కొనసాగిన వర్క్ షాపులో ఆయా అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.

Also read: Swetcha Effect: స్వేచ్ఛ కథనంపై స్పందించిన టాస్క్​ ఫోర్స్​.. మెఫెంటిమైన్​ ఇంజక్షన్లతో ఇద్దరు అరెస్ట్​!

ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఏ.జానయ్య, వివిధ విభాగాల అధిపతులు శ్రీలత, అంజయ్య, చంద్రశేఖర్, ప్రవీణ్, శివకృష్ణ, శాస్త్రవేత్తలు రాజ్ కుమార్, శ్వేత, రాజశేఖర్, విజయ్, స్వప్న తదితరులు వివిధ రకాల పంటల సాగులో పాటించాల్సిన మెళుకువలు, సస్య రక్షణ చర్యలు, ఆధునిక వ్యవసాయం, భూసారం పెంపుదల, అధిక దిగుబడులను అందించే వంగడాలు, తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలను సాధించేందుకు అవలంభించాల్సిన పద్ధతులు, వాణిజ్య పంటల ఎంపికకు పరిశీలించాల్సిన అంశాలు తదితర విషయాలపై సెషన్ల వారీగా రైతులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పురస్కారాలు అందుకున్న అభ్యుదయ రైతులతో పాటు రైతు ఉత్పాదక సంస్థల ప్రతినిధులు సైతం రైతు మహోత్సవం వేదిక ద్వారా తమ అనుభవాలు పంచుకున్నారు.

స్టాళ్లను సందర్శించిన కలెక్టర్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు

కాగా, చివరి రోజైన బుధవారం జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతుతో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి తదితరులు రైతు మహోత్సవ వేదిక, స్టాళ్లను సందర్శించారు.

రైతులు, రైతు ప్రతినిధులతో మమేకం అయ్యి మూడు రోజుల పాటు కొనసాగిన ఈ కార్యక్రమం గురించి వారి స్పందనను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మహోత్సవ వేడుక నిర్వహించడం పట్ల హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. సాగు విషయాలలో అనేక నూతన విధానాలు, సరికొత్త పద్ధతులు, ఆధునిక సాంకేతికత గురించి తెలుసుకోగలిగామని, రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డు గ్రహీతలైన అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు వ్యవసాయ, ఉద్యానవన విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, సైంటిస్టులు, నిపుణులు తమ పరిశోధనా అనుభవాలను, నేటి సామాజిక వ్యవసాయక స్థితిగతులను మేళవిస్తూ అనేక అంశాలపై అవగాహన కల్పించారని, పంటల సాగులో నూతన ఒరవడికి, అధిక దిగుబడుల సాధనకు ఈ మేళా ఎంతగానో దోహదపడుతుందని గట్టి నమ్మకాన్ని వెలిబుచ్చారు.

Local body elections Mlc: కట్టుదిట్టమైన ఆంక్షలు.. భారీ బందోబస్తు మధ్య పోలింగ్!

ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన నిజామాబాద్ జిల్లాలో రైతు మహోత్సవ వేడుక నిర్వహించడం వల్ల స్థానిక రైతులతో పాటు జిల్లాకు అనుకుని ఉన్న కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాల రైతులకు కూడా ఇది ఎంతో ప్రయోజనం చేకూర్చిందని అన్నారు. ప్రస్తుత పరిస్థితులు, సామాజిక అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ, అనుబంధ రంగాలలో శాస్త్రవేత్తలు కనుగొన్న నూతన ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సాగు రంగంలో మెళకువలు, యాంత్రీకరణ తదితర అంశాలపై సైంటిస్టులు, నిపుణులు అవగాహన కల్పించడం జరిగిందన్నారు.

అభ్యుదయ రైతులు వారి అనుభవాలను తోటి రైతులతో పంచుకున్నారని అన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలతో పాటు అనుబంధ రంగాల ఉత్పత్తులకు సంబంధించిన సుమారు 130 కు పైగా స్టాళ్లను రైతులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ, ప్రయోగాత్మక పరిశీలన ద్వారా అవగాహనను పెంపొందించుకోగలిగారని కలెక్టర్ తెలిపారు. ఇక్కడ పరిశీలించిన అంశాలను, నూతన సాగు విధానాల గురించి రైతులు గ్రామాలలో సహచర రైతులకు తెలియజేస్తూ వారిని కూడా అధిక దిగుబడుల సాధన దిశగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ రైతు మహోత్సవానికి ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచామని అన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్ రావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?