BRS Party: తెలంగాణ ఉద్యమ సమయంలో పెద్దపల్లి జిల్లా కీలకంగా పనిచేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి సమ్మె చేస్తే ఢిల్లీవరకు ఉద్యమం సెగ తగిలిందని ఆమే గుర్తుచేశారు. పెద్దపల్లి జిల్లాలో కవిత పర్యటించిన అనంతరం బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఈ క్రమంలో పెద్దపల్లి గులాబి నేతల మధ్య రగడ మొదలైంది. జిల్లా పార్టి కార్యాలయంలో కవిత కారకర్తలను ఉద్దేశించి మాట్లాడింది. తరువాత కవితతో కొంతమంది ఫోటోలు దిగడానికి సిద్దమయ్యారు.
దీనిలో భాగంగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటె చందర్ వర్గాల మధ్య అభిప్రాయ కుదరక ఇరువర్గాలు కార్యకర్తల బూతు పురాణం ఘర్షనకు దిగారు.దీంతో ఉద్రిక్తత పరిస్థితిని అదుపు చేయడంకోసం కార్యకర్తలు నచ్చచెప్పారు.
Also Read: Local body elections Mlc: కట్టుదిట్టమైన ఆంక్షలు.. భారీ బందోబస్తు మధ్య పోలింగ్!