Local body MLC elections: హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ పోలింగ్.. ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు పోలింగ్ మెుదలు కాగా.. ఓటింగ్ ముగిసే సమయానికి (సా.4 గంటలు) 78.57 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. మెుత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు నమోదైనట్లు తెలిపింది. ఓటు హక్కును వినియోగించుకునున్న వారిలో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నట్లు వివరించింది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ దూరం
అయితే హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక (Local body MLC elections)ను అధికార కాంగ్రెస్ (Congress) తో పాటు, విపక్ష బీఆర్ఎస్ పార్టీలు (BRS Party) దూరంగా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ సభ్యులు.. ఎంఐఎం (MIM)కు మద్దతు తెలిపారు. దీంతో బీఆర్ఎస్ మినహా బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియో సభ్యులు పోలింగ్ లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్పోరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
25న ఓట్ల లెక్కింపు
తాజాగా పోలైన స్థానిక సంస్థల ఎన్నికల ఓట్లను ఈ నెల 25న లెక్కించనున్నారు. మొత్తం 112 ఓట్లలో సగానికి పైగా అంటే 57 ఓట్లు సాధించిన ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిచినట్లుగా ఈసీ ప్రకటించనుంది. ప్రస్తుతం ఎన్నికల బరిలో ఎంఐఎం, బీజేపీ పార్టీలు ఉన్నాయి. MIM కు 41 కార్పొరేటర్లు, 9 ఎక్స్ ఆఫీసీయో సభ్యులతో కలిపి మెుత్తం 50 ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్ కూడా మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీకి చెందిన 14 ఓట్లు కూడా ఎంఐఎం అభ్యర్థికే పడనున్నాయి. దీంతో మజ్లిస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమన్న చర్చ జరుగుతోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ బలం 24గా మాత్రమే ఉంది.
Also Read: Praise to Auto Driver: రియల్ హీరోగా కాశ్మీర్ ముస్లిం ఆటో డ్రైవర్.. సర్వత్రా ప్రశంసలు.. ఎందుకంటే!
బీజేపీ అభ్యర్థి ఫైర్
లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గౌతంరావు (Gautham Rao).. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాటకాలు బయటపడ్డాయని ఆరోపించారు. ఓవైపు బీఆర్ఎస్ ఎన్నికలను బహిష్కరించిందని.. మరోవైపు కాంగ్రెస్ సభ్యులు ఎంఐఎంకు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ కు సంబంధించిన ఓట్లు తనకు పడ్డాయని ఆయన ఆరోపించారు. ఈ నెల 25న తాను గెలుస్తానని చెప్పారు.