Bathukama kunta Amberpet: వచ్చే బతుకమ్మ ఉత్సవాల నాటికి బతుకమ్మ కుంటను సిద్ధం చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. బతుకమ్మ కుంటలు సంబంధించిన కోర్టు వివాదం మంగళవారం పరిష్కారమయ్యిందన్నారు.
బుధవారం హైడ్రా కమిషనర్ అంబర్ పేటలోని బతుకమ్మ కుంటను సందర్శించారు. స్థానికుల సమక్షంలో. బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. యుద్ధ ప్రాతిపదికన ఈ చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి, సుందరీకరణ పనులు జరగాలని అధికారులను ఆదేశించారు.
Also read: KTR Fan: బీఆర్ఎస్ రజతోత్సవ సభ కు ఓ అభిమాని వినూత్న ఆహ్వానం.. ఏంచేశాడంటే!
ఈ చెరువును పునరుద్ధరిస్తే పరిసరాలన్నీ ఆహ్లాదకరంగా మారుతాయని అన్నారు. పనులకు సహకరించాలని స్థానికులను కోరారు. ఈ కార్యక్రమానికి స్థానికులు పెద్దయెత్తున హాజరయ్యారు. అభివృద్ధి పనులకు పూర్తి సహకారం అందిస్తామని స్థానికులు కమిషనర్‌కు హామీ ఇచ్చారు.