BJP MP Etela Rajender(image credit:)
హైదరాబాద్

BJP MP Etela Rajender: రెచ్చగొట్టావు.. రివేంజ్ అంతకు మించి.. దాడిపై ఈటల!

BJP MP Etela Rajender: జమ్మూ కశ్మీర్ పహల్‌గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడులపై భారతదేశం అంతటా ఆగ్రహావేశాలు మిన్నంటి పోతున్నాయి. కేవలం భారతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరిగిన దాడిని ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తూ పిరికి పందె చర్యగా అభివర్ణిస్తున్నాయి. ఉగ్రవాదులకు చంపేయ్యాలని దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.

ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని ఎంపి ఈటల రాజేందర్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ భారత్ లో భాగమేనని మోడీ చాటి చెప్పారని ఆయన తెలిపారు.

మోడీ చొరవతో కశ్మీర్ లో ప్రకృతి సంపదతో పర్యాటకం తిరిగి ప్రారంభమైందని, అలాంటి చోట ఉగ్రమూకలు దాడి చేయడం అమానుష చర్యగా పేర్కొన్నారు. టూరిస్ట్ లను అన్యాయంగా చంపేశారని వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. భారత్ సహనాన్ని పరీక్షిస్తే ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు.

Also read: Raja Singh on Terror Attack: కశ్మీర్ లో కొనవద్దు.. తినవద్దు.. రాజాసింగ్ కామెంట్స్

పర్యాటకులనే కాకుండా యావత్ భారతదేశ గుండెలను గాయపరిచిందని, ఈచర్యతో దేశం అంతా ఆవేశంతో రగిలిపోతున్నారని, భారత్ తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటుందని అన్నారు. భాదితుల రక్తం వ‌ృధాగా పోదని వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!