Raja Singh on Terror Attack(image credit:x)
హైదరాబాద్

Raja Singh on Terror Attack: కశ్మీర్ లో కొనవద్దు.. తినవద్దు.. రాజాసింగ్ కామెంట్స్

Raja Singh on Terror Attack: ఆర్టికల్ 370 తీసేసాక ప్రశాంతంగా ఉన్న కశ్మీర్ ను పాకిస్థాన్ ఉగ్రవాదులు చొరబడి అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంటున్నారని, ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టేది లేదన్నారు. ఉగ్రవాదులను చంపి ప్రతీకారం తీర్చుకుంటామన్నారు.

కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ ను కేంద్రం డెవలప్ చేస్తూ కాశ్మీర్ లో పర్యాటకులను ఆకర్షించి అభివృద్ది పథంలో ముందుకు నడిపిస్తుందని ఏ గొడవలు లేకుంగా ఉన్న కాశ్మీర్‌ను పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టులు కశ్మీర్ ను ప్రశాంతంగా ఉంచకుండా కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టూరిస్టులపై దాడి చేయడం దారునమైణ చర్య అని మతం పేరుతో ఉగ్రవాదులు పేరు అడిగి మరీ హిందువులపై చంపేశారని అన్నారు. ఈ ఘటనపై మోడీ ఆధ్వర్యంలో హై లెవెల్ మీటింగ్ జరుగుతుందని దాడి చేసిన ఉగ్రవాదులను చంపేవరకు మోదీ, అమిత్ షా వదలరని అన్నారు. కొందరు కావాలనే ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నారన్నారు.

Also read: Janasena on Terror Attack: కాశ్మీర్ దాడి.. పవన్ మార్క్ నిర్ణయం..

హిందువులు అందరు అమర్‌నాథ్, విష్ణుదేవి యాత్రలకు వెళ్లండి కానీ అక్కడ ఏమీ కొనవద్దని అన్నారు. తెలంగాణలో కూడా మదర్సా లల్లోనే ఉగ్రవాదులు తయారు అవుతున్నారని, అస్సాం సీఎం మాదిరిగా ఇక్కడ కూడా మదర్సా లల్లో తనిఖీలు చేపట్టి ఉగ్రవాదం పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

 

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం