HC on Hyderabad Cricket Association (imAagecrdit:AI)
స్పోర్ట్స్

HC on Hyderabad Cricket Association: హెచ్‌సీఏ‌ పై హైకోర్టు ఆంక్షలు.. ఆర్థికసంబంధ నిర్ణయాలపై ఆంక్షలు

హైదరాబాద్: HC on Hyderabad Cricket Association: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆర్థికసంబంధ నిర్ణయాలపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు వి ధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనుసరించాల్సిన నిబంధనలను పరిగణనలోకి తీసుకోకుండా, హెచ్‌సీఏ కొత్తగా ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు, పరిపాలనా నిర్ణయాలు తీసుకోకూడదని ఆదేశించింది. ఎలాంటి చెక్కులను జారీ కూడా చేయకూడదని స్పష్టం చేసింది. అయితే, సిబ్బంది జీతభత్యాలు, రోజువారీ వ్యయాలచెల్లింపునకు మినహాయింపు ఉంటుందని తెలిపింది.

తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఈ ఆంక్షలు ఆచరణలో ఉంటాయని పేర్కొంది. కాగా, హెచ్‌సీఏలో ఆర్థిక అవకతవకలపై సీబీఐ దర్యాప్తు కోరుతూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) దాఖలు చేసిన పిటిషన్‌‌పై విచారణ సందర్భంగా జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డితో కూడిన హైకోర్టు ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. టీసీఏ తరపున సీనియర్ న్యాయవాది రాజా శ్రీపతి రావు వాదనలు వినిపించారు. హెచ్‌సీఏ తరపున సీనియర్ న్యాయవాది జే రామచందర్ రావు కోర్టుకు హాజరయ్యారు.

Also Read: Telangana Inter Results 2025: ఇంటర్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. మార్క్స్ ఇలా తెలుసుకోండి!

బీసీసీఐ, సీబీఐ న్యాయవాదులు కూడా కేసు విచారణకు వచ్చారు. హెచ్‌సీఏ సీనియర్ న్యాయవాది శ్రీపతి రావు వాదిస్తూ, హెసీఏ పాలకమండలిలో కొత్తగా ఎలాంటి అభియోగాలు లేవని చెప్పారు. అయితే, రాజా శ్రీపతి రావు కౌంటర్‌గా మూడు కీలకమైన విషయాలను లేవనెత్తారు. హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజ్, ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావులపై పలు ఆరోపణలు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణను 2025 జూన్ 16కు హైకోర్టు వాయిదా వేసింది.

Also Read: Gold Rate Today : ఆల్ టైం రికార్డ్.. మహిళలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్?

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!