Telangana Inter Results 2025 (Image Source: AI)
తెలంగాణ

Telangana Inter Results 2025: ఇంటర్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. మార్క్స్ ఇలా తెలుసుకోండి!

Telangana Inter Results 2025: లక్షలాదిమంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) ఫలితాలను రిలీజ్ చేశారు. మ.12 గంటల తర్వాత ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ తో పాటు ఓకేషనల్ ఫలితాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫలితాల విడుదల కార్యక్రమానికి ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృష్ణ ఆదిత్యతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం హాజరయ్యారు.

19 కేంద్రాల్లో మూల్యాంకనం
ఈ ఏడాది మార్చి 5 నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలు జరిగాయి. 25వ తేదీ వరకూ జరిగిన ఈ పరీక్షలకు రెండు సంవత్సరాలు కలిపి దాదాపు 9.5లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మెుత్తం 60 లక్షల పరీక్షా పత్రాలకు మూల్యాంకనం చేయాల్సి రాగా.. దానిని 19 కేంద్రాల్లో నిర్వహించారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లోనే మూల్యంకనం ప్రక్రియ ముగియగా… మార్కుల కంప్యూటీకరణ కోసం ఇంతకాలం పట్టింది.

Also Read: PSR Anjaneyulu Arrest: కాదంబరి జత్వాని కేసులో కీలక పురోగతి.. పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్!

రిజల్ట్స్ ఇలా పొందండి
పరీక్షలకు హాజరైన ఇంటర్ విద్యార్థులు తమ రిజల్ట్స్ ను tgbie.cgg.gov.in వెబ్‌సైట్‌ లో తెలుసుకోవచ్చు. మీ హాల్ టికెట్ నెంబర్ ను వెబ్ సైట్ లో నమోదు చేసి సబ్ మిట్ చేయడం ద్వారా మీ పరీక్షలకు సంబంధించిన మార్కుల వివరాలను పొందవచ్చు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు తర్వాతి తరగతికి ఉత్తీర్ణత సాధిస్తారు. పొరపాటున ఫెయిల్ అయితే సప్లిమెంటరీ ఫీజు చెల్లించి తిరిగి పాస్ అయ్యే అవకాశాన్ని ఇంటర్ బోర్డ్ కల్పించింది.

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?