BRS Kavitha: ఖమ్మంపై ఎమ్మెల్సీ కవిత ఫోకస్ పెట్టింది. ఆమెకు ఖమ్మం బాధ్యతలు అప్పగించారని ప్రచారం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో వరుస పర్యటనలతో కేడర్ ను సైతం జోష్ నింపే ప్రయత్నం చేస్తుంది. రాబోయే ఎన్నికల్లో మెజార్టీ సీట్లే లక్ష్యంగా పావులు కదుపుతుంది. పార్టీ అధినేత ఆదేశాలతోనే జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. కేడర్ తో భేటీలు, సభ సన్నాహక సమావేశాలతో స్పీడ్ పెంచారు.
బీఆర్ఎస్ పార్టీ ఖమ్మంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని పటిష్టం చేయాలని భావిస్తుంది. అందులో భాగంగానే ఎమ్మెల్సీ కవితకు ఖమ్మం ఉమ్మడి జిల్లా బాధ్యతలను అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతోనే కవిత ఖమ్మంజిల్లా పర్యటనలు చేస్తున్నట్లు తెలిసింది.
అందుకే ఇప్పటి నుంచి గ్రౌండ్ ను సిద్దం చేస్తున్నట్లు అందుకు, పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఓవైపు పార్టీ కార్యక్రమాలు, మరోవైపు జాగృతి నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వంపై తనదైన శైలీలో విమర్శలు గుప్పిస్తున్నారు. కేడర్ లోనూ జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు.
తాను భరోసాగా ఉంటానని, కేసీఆర్ కు కేడర్ కు మధ్య వారధిలా ఉంటానని, కార్యకర్తల సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని, ఏ చిన్న అవసరమున్నా తనను కార్యకర్తలు సంప్రదించవచ్చని పేర్కొన్నారు. కార్యకర్తలను కాపాడుకోవడాన్ని బాధ్యతగా భావిస్తానని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ కోటాలో పాగా కోసం
కాంగ్రెస్ కు ఉమ్మడి ఖమ్మం జిల్లా కంచుకోట. అసెంబ్లీ ఎన్నికల్లో వస్తే ఆపార్టీ నుంచి ఎవరు పోటీచేసిన విజయం ఖాయం. అయితే ఈ కంచుకోటపై గులాబీ పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే కవితను అస్త్రంగా ప్రయోగిస్తున్నారు. పార్టీకి కొంత కేడర్ ఉండటం, జాగృతి ని సైతం బలోపేతం చేయాలని భావిస్తున్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014లో కొత్తగూడెం,2018లో ఖమ్మం, 2023 లో భద్రాచలం లో మాత్రమే విజయం సాధించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏ ఎన్నికలు జరిగినా ఒకస్థానానికే పరిమితం అవుతుంది. అయితే ప్రస్తుతం ముగ్గురు మంత్రులు ఉన్నారు. వారి వైఫల్యాలను, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో జాప్యం, ఆరుగ్యారెంటీల అమలులో వైఫల్యాలను ఎత్తిచూపి ప్రజలను గులాబీ వైపునకు తిప్పుకోవాలని ప్రయత్నాలను ఇప్పటినుంచే స్టార్ట్ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మినిమం 6 నుంచి 8 అసెంబ్లీలో సెగ్మెంట్లలో పాగా వేయాలని కసరత్తు చేస్తుంది.
చేసిన అభివృద్ధిని వివరించాలని
బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో ఖమ్మంలో చేసిన అభివృద్ధిని వివరించాలని భావిస్తుంది. సీతారామ ప్రాజెక్టు, భద్రాద్రి ఆలయం అభివృద్ధి, మున్నేరు వాగు మరమ్మతులకు నిధుల కేటాయింపు, సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు, రోడ్ల విస్తరణ తదితర అంశాలను వివరించాలని భావిస్తున్నారు. మరోవైపు పార్టీ నుంచి కీలక నేతలంతా అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ మారారు. పార్టీకేడర్ ఉన్నటికీ నేతల లేమీ స్పష్టంగా కనబడుతుంది. దానిని పూరించేందుకే కవితకు బాధ్యతలు అప్పగించారనే ప్రచారం ఊపందుకుంది.
స్తంభించిన పార్టీ యాక్టివిటీస్
జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలుస్తంభించాయి. అయితే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ కావడంతో దానిని మలుచుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా తాతామధు, భద్రాద్రి కొత్తగూడెం అధ్యక్షుడిగా రేగా కాంతారావులు వ్యవహరిస్తున్నారు. అదే జిల్లా నుంచి రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర పనిచేస్తున్నారు. అయినప్పటికీ ఆశించిన మేర పార్టీ ని యాక్టీవ్ చేయడం లేదు.
Also Read: Hyderabad: మత్తు దందాకు బలి! ముందే హెచ్చరించిన స్వేచ్ఛ
మరోవైపు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు అంతా సైలెంట్ అయ్యారు. దీంతో కేడర్ లో కొంత అయోమయ పరిస్థితి నెలకొంది. దీనిని దృష్టిలో ఉంచుకొని కవితతో పార్టీ కార్యక్రమాలు యాక్టీవ్ చేసినట్లు సమాచారం. అందుకే పార్టీ నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేడర్ ఏ ఆపద వచ్చినా తనను సంప్రదించవచ్చని కవిత భరోసా ఇచ్చారు. దీంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఖమ్మం జిల్లాలో రెండ్రోజుల పర్యటన చేయడంతో ఇప్పుడు సర్వత్రా చర్చజరుగుతుంది.