Medak Tragedy9 image credit: twitter)
మెదక్

Medak Tragedy: మెదక్‌లో కలచివేసిన సంఘటన.. ఆత్మహత్యకు యత్నించిన తల్లి, ఇద్దరు చిన్నారులు

Medak Tragedy: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగులపల్లి జాతీయ రహదారిపై గల వాగులో ఇద్దరు పిల్లలతో సహా తల్లి దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అది గమనించిన స్థానికులు తల్లిని కాపాడారు. ఇద్దరు పిల్లలు మాత్రం మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మాసాయిపేట‌కు చెందిన వడ్డేపల్లి మమతకు ఇద్దరు కూతుళ్లు.. పూజిత (7), తేజస్విని (5) ఉన్నారు. భర్త చనిపోవడంతో తల్లి ఇంటి వద్ద ఉంటున్న మమత నాగులపల్లి రహదారిపై గల వాగులోకి ఇద్దరు పిల్లలతో దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది.

Om Prakash murder case: మాజీ డీజీపీ దారుణ హత్య.. పక్కా స్కెచ్ తో లేపేసిన భార్య, కూతురు

ఈ ఆత్మహత్యా ప్రయత్నంలో ఇద్దరు పిల్లలు మృతి చెందగా, మమతను స్థానికులు కాపాడారు. వాగులో దూకి చనిపోయిన చిన్నారులను ప్రత్యేక బృందాల ద్వారా తూప్రాన్ పోలీసులు బయటకు తీసుకొచ్చారు. తన ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో మమత విలపించింది. ఇదిలా ఉండగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. తూప్రాన్ ఎస్ఐ సదానందం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ