Viral News: ప్రస్తుతం, సోషల్ మీడియా ( Social Media )ను విపరీతంగా వాడుతున్నారు. ఖాళీ సమయం దొరికితే చాలు.. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్ లో వీడియోస్ చూస్తూ.. వాళ్ళు కూడా అలాగే తయారువుతున్నారు. మరి ముఖ్యంగా, రీల్స్ అనే ఫీచర్ వచ్చాక ఒక్కొక్కరు తమకున్న టాలెంట్ ను బయట పెడుతున్నారు.
Also Read: CM Revanth Reddy: కాలుష్య రహిత నగరాలతో.. పర్యావరణ పునరుజ్జీవనం.. సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ప్రపంచనలుమూలల్లో(World) ఏం జరిగినా సరే కొద్దీ నిముషాల్లోనే స్మార్ట్ ఫోన్లో దర్శనమిస్తుంది. ట్రెండ్ ఎవరికీ వారు సెట్ చేస్తున్నారు. ఒక్క వీడియోతో ఎలా అయిన ఫేమస్ అవ్వాలని రక రకాల ప్రయత్నాలు చేస్తారు. వీటిని వెంటనే సోషల్ మీడియాలోకి షేర్ చేస్తారు. ఇలా రోజు నెట్టింట కొన్ని లక్షల వీడియోలు ( Viral Videos ) అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని బాగా వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా ఓ అమ్మాయికి సంబందించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూశాక .. మీరు కూడా ఆ యువతీ లాగా ధైర్యంగా ఉండాలనుకుంటారు. ఇంతకీ, ఆ అమ్మాయి ఏం చేసిందో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Ranjini: సినీ ఇండస్ట్రీలో లైంగిక అంశాలను ‘మ్యానేజ్’ చేయాలన్న మాలా పార్వతిపై రంజని ఫైర్!
ఈ అమ్మాయిని స్కామర్స్ పొగిడారు. ముందు, ఆ సైబర్ నేరగాడు ఒక అమ్మాయికి కాల్ చేసి, నేను మీ నాన్న గారికి రూ. 12000 ఇవ్వాలని చెప్పాడు. ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా మా నాన్న నాకేం చెప్పలేదు అని అన్నది. ఏం పర్లేదు, నేను మీకు ముందు రూ.10 రూపాయలు పంపిస్తాను, మీకు వచ్చాక నాకు చెప్పండి అని అన్నాడు. ఆ అమ్మాయి వెంటనే నాకు వచ్చాయని చెప్పింది. అంటే ఇక్కడ ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఇంకొకరు గేమ్ ఆడుతున్నారు. అయితే, ఆ సైబర్ నేరగాడు ఆడిన ఆటలో మనీ సెండ్ అవ్వలేదు కానీ, పంపించినట్టు మెసేజ్ లు మాత్రమే పెట్టాడు. అలా ఈ సారి ఏకంగా రూ.20,000 వేలను పంపించాడు. అప్పుడు, వెంటనే ఆ అమ్మాయి మీరు ఇరవై వేలు పంపించారు అని చెప్పింది.
Also Read: Kavya Kalyanram: బ్లాక్ శారీలో కనిపించి కుర్రాళ్ళను.. టెంప్ట్ చేస్తున్న బలగం బ్యూటీ కావ్య
అప్పుడు అతను ఒక పని చేయమ్మా నువ్వు, నీ రెండు వేలు ఉంచుకుని, నాకు రావాల్సిన రూ.18 వేలు వేయమ్మా అని అన్నాడు. ఆ అమ్మాయి కూడా అలాగే అమౌంట్ పంపించింది. ఫోన్ చేసి వచ్చాయా అంకుల్ మీ మనీ అని అడగగా, ఆ సైబర్ నేరగాడు ఒక్క దెబ్బకి ఖంగు తిని తెలివైన దానివే అని ఆ అమ్మాయిని పొగిడేసాడు. ఇక్కడ ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ స్కామర్ లాగే మనీ మెసేజ్ లు సెండ్ చేసింది.