CM Revanth Reddy(image credit:X)
తెలంగాణ

CM Revanth Reddy: కాలుష్య రహిత నగరాలతో.. పర్యావరణ పునరుజ్జీవనం.. సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

CM Revanth Reddy: ప్రఖ్యాత కిటాక్యుషు నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ బృందానికి స్థానిక జపనీస్ సాంప్రదాయ రీతిలో సాదర స్వాగతం లభించింది. ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారులకు కిటాక్యుషు నగర మేయర్ కజుహిసా టకేచీ ఆత్మీయ స్వాగతం పలికారు.

ఒకప్పుడు జపాన్‌లో అత్యంత కాలుష్యపూరిత నగరంగా పేరుగాంచిన కిటాక్యుషులో గాలి, నీరు, నేల అన్నీ తీవ్ర కాలుష్యంతో కూరుకుపోయిన దుస్థితి ఉండేది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం అమలు చేసిన పరిరక్షణ విధానాలతో కిటాక్యుషు నగరం కోలుకుంది.

Also read: Plastic Waste: గ్రామాల్లో వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్లు.. రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు!

ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ, రీసైక్లింగ్ ఆవిష్కరణలు, సుస్థిరత పరంగా కిటాక్యుషు నగరం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. పర్యావరణ పునరుజ్జీవనానికి, సుస్థిర నగర అభివృద్ధికి ఒక ఆదర్శ నమూనాగా మారింది. కాలుష్యం నుంచి బయటపడేందుకు కిటాక్యుషు నగరంలో అమలు చేసిన విధానాలను, ప్రస్తుతం పాటిస్తున్న జాగ్రత్తలను మేయర్ నేతృత్వంలోని బృందం ముఖ్యమంత్రికి వివరించింది.

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!