Hydra Ranganath [ image credi swetcha reporter]
హైదరాబాద్

Hydra Ranganath:హైదరాబాద్ లో ఇలా చేయకుంటే ప్రమాదమే.. హైడ్రా కమిషనర్ హెచ్చరిక..!

Hydra Ranganath: అగ్ని ప్ర‌మాదాల నివార‌ణ‌కు ఏం చేయాల‌నే అంశంపై అంద‌రిలో అవ‌గాహ‌న పెరిగినపుడే ఆశించిన స్థాయిలో ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాధ్ పేర్కొన్నారు. ఫైర్ సేఫ్టీ వారోత్స‌వాల్లో భాగంగా హైడ్రా కార్యాల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో హైడ్రా క‌మిష‌న‌ర్ మాట్లాడుతూ ఒక్క అగ్ని ప్ర‌మాదం కూడా జ‌ర‌గ‌కూడ‌దనే ల‌క్ష్యంతో అంద‌రూ క‌ల‌సి ప‌ని చేస్తే త‌ప్ప‌కుండా అది సాధ్య‌మౌతోంద‌ని అన్నారు.

ఫైర్ సేఫ్టీ విధానాల‌ను అంద‌రూ అనుస‌రించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, క్షేత్ర‌స్థాయిలో ఉన్న ఇబ్బందుల‌ను ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. విద్యుత్ షార్ట్‌ స‌ర్క్యూట్ తో త‌ర‌చూ అగ్ని ప్ర‌మాదాలు జ‌రిగాయ‌ని వ‌స్తున్న ఫిర్యాదుల నేప‌థ్యంలో ఈ స‌మ‌స్య‌పై ఎక్కువ దృష్టి పెట్టాల‌ని సూచించారు. అగ్ని ప్ర‌మాదాలు ఎక్క‌డ ఎక్కువ‌గా సంభ‌విస్తున్నాయి? అందుకు గ‌ల కార‌ణాలేంటి? ఇలా స‌మ‌గ్ర స‌మాచారంతో డేటా ఉంటే వాటిని నివారించ‌డానికి మార్గాలు సుల‌భ‌మవుతుందన్నారు.

 Also Read: Naini Coal Mine: నైనీ బొగ్గు గని ప్రారంభం.. దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు సింగరేణి సిద్ధం!

అగ్ని ప్ర‌మాదాల నివార‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ షార్ట్ ఫిల్మ్‌లు రావాల‌ని క‌మిష‌న‌ర్ సూచించారు. అంత‌కు ముందు హైడ్రా ఫైర్ విభాగం అద‌న‌పు సంచాల‌కులు పాప‌య్య‌, హైడ్రా ఎస్‌పీ సుద‌ర్శ‌న్, హైడ్రా ఫైర్ విభాగం రీజ‌న‌ల్ ఆఫీస‌ర్ జ‌య‌ప్ర‌కాష్ అగ్ని ప్ర‌మాదాల నివార‌ణ‌పై మాట్లాడారు. ఆసుప‌త్రులు, కార్యాల‌యాలు, ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య స‌ముదాయాలలో ఫైర్ సేఫ్టీ విభాగాల‌కు చెందిన ప్ర‌తినిధులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని విలువైన సూచ‌న‌లు చేశారు. అగ్ని ప్ర‌మాదాల నివార‌ణ‌కు ఉద్దేశించిన ప‌నిముట్లు వినియోగంపై అవ‌గాహ‌న ఉండాల‌న్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!