Karimnagar Jagtial farmers: మామిడి ఎగుమతి కి ప్రసిద్ధి గాంచిన కరీంనగర్, జగిత్యాల పరిసర ప్రాంతాల రైతులకి మార్కెటింగ్ కష్టాలు ఎదురు అవుతున్నాయి. జగిత్యాల జిల్లా అంటనే మామిడి సాగుకు పెట్టింది పేరు. ఆ జిల్లాల్లో మామిడి దిగుబడి అధికంగా ఉంటుంది కానీ, మద్దతు ధర లేకపోవడంతో ప్రైవేటులో విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యాపారులు సిండికేట్ గా మారి తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండటంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
జగిత్యాల జిల్లాలో మామిడి రైతులు ఎక్కువగా ఉండడంతో జగిత్యాల లోనే 21 ఎకరాలలో మామిడి మార్కెట్ ఏర్పాటు చేసారు… ప్రతీ సంవత్సరం ఈ మామిడి మార్కెట్ లోనే సుమారుగా 200 నుండి 300 వందల కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. మామిడికాయలు కొనుగోలు చేసేందుకు 30 మంది కమీషన్ ఏజెంట్లు, 50 మంది అడ్తిదారులు ఉన్నారు.
జగిత్యాల నుండి ఢిల్లీ కి మామిడికాయల ని ఎగుమతి చేసేందుకు ఢిల్లీ కి చెందిన హోల్ సేల్ వ్యాపారులు సీజన్లో జగిత్యాల లోనే తిష్ట వేసి కమీషన్ ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేసి వివిధ ప్రాంతాలకి తరలిస్తుంటారు. సీజన్ సమయంలో జగిత్యాల మామిడి మార్కెట్ నుండి పంజాబ్, హర్యానా, ఢిల్లీ, నాగ్ పూర్, ముంబై వంటి ప్రాంతాలకు ప్రతిరోజు 10 లారీలలో టన్నులకొద్ది మామిడి ని తరలిస్తుంటారు.
అయితే జగిత్యాల మామిడి మార్కెట్ లో ఏజెంట్లు చెప్పిందే ధర అన్నట్లుగా తయారయ్యింది.
Also read: Congress on Kavitha: ఒక్క ఫొటోలో ఇంత అర్థముందా.. ఏంటమ్మ కవిత ఇది!
ఓపెన్ మార్కెట్ నిర్వహిస్తామని అధికారులు చెబుతున్న ఇక్కడ మాత్రం ధర నిర్ణయించేది సిండికేట్ వ్యాపారులే… నాణ్యత ని బట్టి ధరలు నిర్ణయించాల్సిన అధికారులు మిన్నకుండిపోతున్నారు… కమీషన్ ఏజెంట్లు చెప్పిన ధరనే ఉండడంతో తాము నష్టబోతున్నామని, అధికారులు ఓపెన్ మార్కెట్ నిర్వహిస్తే తమకి మద్దతు ధర వస్తుందని రైతులు అంటున్నారు.