MLA Madhava reddy: ప్రజా ప్రభుత్వం పరిపాలనలో రైతులకు ఎలాంటి ఆపద రానివ్వమని, రైతులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ మండలం గోట్ల కొండ గ్రామంలో గాయత్రి వరి దాన్యం కొనుగో లు కేంద్రాన్ని, దుగ్గొండి మండ లం మందపల్లి గ్రామంలో కొను గోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారం భించారు.ఈ సందర్భంగా ఆ యా గ్రామాల్లో వేరువేరుగా జరిగిన సమావేశాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దొంతి మా ధవరెడ్డి పాల్గొని మాట్లాడారు.
రైతులకు ఏకాకాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.ప్రజల సంక్షేమం, రై తు అభివృద్ధి మా ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు. వాతా వరణ సూచన మేరకు ధాన్యం రాశుల వద్ద టార్పిలిన్లను అందుబాటులో ఉంచుకోవాల ని రైతులకు సూచించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుం దని అన్నారు.
Also Read; Protest against Waqf Bill: వక్ఫ్ బిల్లుపై నిరసన.. జోగిపేటలో శాంతియుత ర్యాలీ!
సన్న రకం వడ్ల కు క్వింటాల్ కు 500/- రూపా యలు బోనస్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. కేవలం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మాత్రమే సన్నధాన్యానికి బోనస్ లభిస్తుందన్నారు.రైస్ మిల్లులో విక్రయాలకు బోనస్ వర్తిం చదని ప్రతి ఒక్క రైతుకు ఈ విషయంపై అవగాహన కల్పించాలని సూచించారు. ధా న్యం కొనుగోలును వేగవంతం చేసి లోడింగ్, రవాణా త్వరిత గతిన పూర్తయ్యేలా అధికారు లు చొరవ తీసుకోవాలని కోరా రు. గన్ని సంచుల కొరత లేకుం డా చూసుకోవాలని అధికారు లను ఆదేశించారు.
రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఏ గ్రేడ్కు రూ. 2320,కామన్ రకానికి రూ.2300 ధర చెల్లిస్తుందని అన్నారు. ప్రభుత్వం నిర్ణయిం చిన ప్రకారం 17% మాయిచ్చర్ ఉండాలి అని అన్నారు. నిబం ధనల మేరకు తేమ శాతం వ చ్చిన ధాన్యాన్ని వెంటనే కొ నుగోలు చేసి మిల్లులకు తర లించాలని కోరారు. లారీలలో మిల్లుల కు తరలించిన ధాన్యా న్ని అన్లోడ్ చేసే దగ్గర జాప్యం జరగకుండా చూడాలనీ సూ చించారు.
Also Read: Jai Beam Jai Bapu Samvidhan: జై భీమ్, జై బాపు.. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పిలుపు!
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపా యా లు కల్పించాలని అధికారుల ను ఆదేశించారు. రవాణ, హమాలీ, గోనె సంచుల కొరత రాకుండా చూడాలని అన్నా రు.వేసవికాలం కాబట్టి వీలై నంతగా నీడలో ఉండాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, మార్కెట్ కమిటీ చైర్మన్లు పాలయి శ్రీనివాస్, రావుల హరీష్ రెడ్డి, అధికారులు,ప్రజా ప్రతినిధులు రంజిత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్ నాయక్, పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు