Jai Beam Jai Bapu Samvidhan: బాపును , అంబేద్కర్ ను గౌరవించుకోవాలని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని మండల ఇన్చార్జి జనగాం రమేష్ గౌడ్ , వర్ధన్నపేట మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రామవరం ,దివిటీపల్లి ,బండౌతపురం, అంబేద్కర్ నగర్ గ్రామాల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ఆదేశాలతో జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ ర్యాలీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయనను అన్ని దేశాలు ప్రపంచ మేధావిగా అభివర్ణింస్తుంటే బీజేపీ వాళ్ళు దాన్ని అంగీకరించడం లేదని ఆరోపించారు.. రాజ్యాంగం పైన దాడి జరుగుతోందని, రాజ్యాంగంలో మార్పులు చేయాలని, రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటే రాజ్యాంగం మనల్ని కాపాడుతుందని తెలిపారు.
Also Read: Protest against Waqf Bill: వక్ఫ్ బిల్లుపై నిరసన.. జోగిపేటలో శాంతియుత ర్యాలీ!
జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రతీ ఒక కాంగ్రెస్ కార్యకర్త సమన్వయంతో కలసి విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పోశాల వెంకన్న,తాళ్లపెళ్ళి శ్రీనివాస్ , మరుపట్ల సాయి,ఎస్.సి సెల్ మండల అధ్యక్షుడు మల్లెపాక సమ్మయ్య , భాస్కర్, ఎలియస్,జోసెఫ్ రామారం , దివిటిపల్లి , బండౌతాపురం,అంబేద్కర్ నగర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, కాంగ్రెస్ శ్రేణులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు