Protest against Waqf Bill ( image cresit: swetcha reporter)
మెదక్

Protest against Waqf Bill: వక్ఫ్ బిల్లుపై నిరసన.. జోగిపేటలో శాంతియుత ర్యాలీ!

Protest against Waqf Bill: వక్ఫ్‌బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా జోగిపేట పట్టణంలో ముస్లీం సోదరులు పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించారు. ముస్లీంలు నల్ల బ్యాడ్జీలను ధరించి వందల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో వృద్దులు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసన ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగింది.

ప్లకార్డులు పట్టుకొని బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. నిరసన ర్యాలీ సందర్బంగా జోగిపేట సీఐ అనీల్‌కుమార్, ఎస్‌ఐ పాండు, సంగారెడ్డి నుంచి ఏఆర్‌ ప్రత్యేక ఫోర్స్‌తో బందోబస్తును నిర్వహించారు.

 Also Read: Bhu Bharathi Portal: భూమి హక్కులకు న్యాయబద్ధత.. భూ భారతి చట్టం మీకు తెలుసా?

గుడ్‌ఫ్రైడే కావడంతో ర్యాలీకి పోలీసుశాఖ అనుమతిని నిరాకరించినా ప్రత్యేకంగా అనుమతిని తీసుకొని ర్యాలీని నిర్వహించారు. ముస్లీం సోదరులంతా వందల సంఖ్యలో పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. సీఐ, ఎస్‌ఐలు స్టేషన్‌కు చేరుకొని ముస్లీం సోదరులతో మాట్లాడారు. ర్యాలీ ప్రశాంతంగా ముగియడంతో పోలీసుశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు