MMTS Assault Case: ఇటీవల హైదరాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్ లో అత్యాచార యత్నం జరిగిన ఘటనలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. అసలు అత్యాచార యత్నం జరగలేదని ఇన్ స్టా రిల్స్ చేస్తూ ప్రమాదవశాత్తు అమ్మాయి లోకల్ ట్రైన్ నుంచి పడిపోయిందని రైల్వే పోలీసులు తాజాగా వెల్లడించారు. అయితే దానిని బాధిత యువతి ఖండించడం ఆసక్తికరంగా మారింది. అయితే కొద్దిసేపటి రైల్వే పోలీసుల ప్రకటనను బాధిత యువతి ఖండించింది. తనపై అత్యాచారం జరిగింది వాస్తవమేనని పేర్కొంది. ఆ సమయంలో తాను రీల్స్ చేయడం లేదని స్పష్టం చేసింది.
‘నిందితుడ్ని గుర్తుపట్టా’
ఎంఎంటీఎస్ అత్యాచారయత్నం ఘటనలో
తాను పోలీసులను ఎక్కడా తప్పుదోవ పట్టించలేదని బాధిత యువతి పేర్కొంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని తనకు చూపించినప్పుడు తాను అతడిని గుర్తుపట్టాననీ తెలిపింది. తాను సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళుతుండగా ఎంఎంటీఎస్ లో గుర్తు తెలియని వ్యక్తి తనపై అత్యాచారయత్నం చేశాడంటున్నది వాస్తవం అని బాధితురాలు వెల్లడించింది.
MMTS అత్యాచారయత్న ఘటనలో ట్విస్టుల మీద ట్విస్టులు
తనకు అసలు రీల్స్ చేసే అలవాటు లేదని పోలీసులు క్లియర్ గా అబద్ధాలు చెప్తున్నారని ఆరోపిస్తున్న బాధితురాలు
ట్రైన్ లో ఒక యువకుడు తనతో మిస్ బిహేవ్ చేశాడని అతడి నుంచి తప్పించుకునే క్రమంలోనే కిందకు దూకానని చెప్తున్న బాధితురాలు
రీల్స్… https://t.co/MUdnd8olEH pic.twitter.com/fZLrhlWQkh
— BIG TV Breaking News (@bigtvtelugu) April 18, 2025
‘డైవర్ట్ చేసి దూకేశా’
ఆ సమయంలో నిందితుడు తనతో ఏకాంతంగా గడపాలని అడగడంతో.. అతని నుంచి తప్పించుకునేందుకు మొదట తాను ఒప్పుకున్నానని.. తర్వాతి స్టేషన్ లో తన రూమ్ ఉందని.. అక్కడ దిగి వెళ్దామని అతడికి చెప్పినట్లు పేర్కొంది. అలా అతడ్ని డైవర్ట్ చేసి రన్నింగ్ ట్రైన్ నుంచి దూకానని తెలిపింది. ఈ ఘటనపై తనకు న్యాయం చేయాలని తనకు జరిగినట్లు ఏ యువతికి జరగకూడదని బాధితురాలు ఆకాక్షించింది.
Also Read: Constable Murder AP: తల్లి, కూతురితో అక్రమ సంబంధం.. కట్ చేస్తే కానిస్టేబుల్ మర్డర్!
‘మళ్లీ దర్యాప్తు చేయండి’
మార్చి 22వ తేదీన తనపై జరిగిన అత్యాచారయత్నంపై పోలీసులు మరోసారి విచారణ జరపాలని బాధిత యువతి డిమాండ్ చేసింది. అయితే రైల్వే ఎస్పీ చేసిన ప్రకటనకు బాధిత యువతి చేసిన తాజా వ్యాఖ్యలు పరస్పరం విరుద్ధంగా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. బాధితురాలే పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిందా లేక పోలీసులు బలవంతంగా కేసు మూసేయడం కోసం ఇలా చెప్పించారా అన్న అనుమానం సర్వత్ర వ్యక్తమవుతోంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఈ కేసుకు ముంగింపు పలకాలని అందరూ కోరుకుంటున్నారు.