Constable Murder AP (Image Source: AI)
క్రైమ్

Constable Murder AP: తల్లి, కూతురితో అక్రమ సంబంధం.. కట్ చేస్తే కానిస్టేబుల్ మర్డర్!

Constable Murder AP: ఆంధ్రప్రదేశ్ లో ఓ కానిస్టేబుల్ దారుణ హత్య ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. మంగళగిరి ఆక్టోపస్ హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కానిస్టేబుల్ ఫరూక్.. నంద్యాల జిల్లాలో దారుణ హత్యకు గురయ్యారు. సిరివెళ్ల మండలం పచ్చర్ల ఘాట్ సమీపంలో అతడి మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే ఫరూక్ ను ఎవరు చంపారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఫరూక్ హత్యకు సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూశాయి.

సెలవులపై వెళ్లి.. శవంగా
అక్టోపస్ కానిస్టేబుల్ ఫరూక్‌ స్వస్థలం.. ఏపీలోని ఆళ్లగడ్డ మండలం పెద్ద కందుకూరు గ్రామం. ఉద్యోగ రిత్యా మంగళగిరి అక్టోపస్ హెడ్ క్వార్టర్స్ లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం గుంటూరులో భార్య, ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నారు. ఈ వారంలో సెలవుల మీద నంద్యాలకు వెళ్లిన ఫరూక్.. మూడ్రోజులు సెలవులు ముగిసినా ఇంటికి రాలేదు. దీంతో అప్రమత్తమైన భార్య.. వెంటనే గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం పచ్చర్ల ఘాట్ వద్ద అతడి మృతదేహాన్ని కనుగొన్నారు.

అక్రమ సంబంధమే కారణమా!
కానిస్టేబుల్ ఫరూక్ మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. అతడిది హత్య అని నిర్ధారించారు. అయితే ఫరూక్ కు నంద్యాలకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. అదే విధంగా ఆమె కూతురుతోనూ అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హత్యకు అదే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కూతురుతో ఎఫైర్ పెట్టుకున్నందుకు తల్లి చంపిందా? లేదా కూతురుకు అప్పటికే ఉన్న ప్రియుడు.. కోపంతో ఈ పని చేశాడా? అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది.

Also Read: Heavy rains in Hyderabad: హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఆ ఏరియాల్లో అల్లకల్లోలం!

ప్రాణాలు హరిస్తున్న ఇల్లీగల్ ఎఫైర్స్
అక్రమ సంబంధాల కారణంగా కొందరు తమ జీవితాలను అర్థాంతరంగా ముగిస్తున్నారు. మరికొందరు హత్యలు చేసి జైళ్లల్లో మగ్గుతున్నారు. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో ఇల్లీగల్ ఎఫైర్స్ గణనీయంగా పెరిగిపోతున్నాయి. ప్రియుడు/ప్రియురాలితో కలిసి కొందరు తమ జీవిత భాగస్వామిని తుదిముట్టిస్తున్న ఘటనలో తరచూ వెలుగు చూస్తున్నాయి. దీంతో వారి పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు.

Just In

01

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?