Ponguleti Srinivas Reddy On BRS: ప్రజలు ప్రశాంతమైన పాలనను కోరుకుంటున్నారు.
Ponguleti Srinivas Reddy On BRS (imagecredit:twitter)
ఖమ్మం

Ponguleti Srinivas Reddy On BRS: ప్రజలు ప్రశాంతమైన పాలనను కోరుకుంటున్నారు.. మంత్రి పొంగులేటి

ములుగు: Ponguleti Srinivas Reddy On BRS:  గత ప్రభుత్వం ధరణి పేరిట తమకు ఇష్టం వచ్చినట్టు భూములను రిజిస్టర్ చేశారని తెలంగాణ రెవెణ్యు శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిఅన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ లో నిర్వహించిరన భూ భారతీ రెవెన్యూ సదస్సులో వారు మాట్లాడారు. ఈ సమావేశానికి మంత్రి సీతక్క, మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. గత ప్రభుత్వం రైతులను మోసం చేయడానికి ధరణి తీసుకు వచ్చారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హమీలమేరకు ధరణిని బంగాళ ఖాతంలో కలుపు తామని, చెప్పిన విదంగానే దాన్ని కలిపామని అన్నారు.

రాష్ట్రంలో రైతులు కోల్పోయిన భూమిని తిరిగి మల్లి వారికి చెందేలాగా చేయాలనేదే లక్ష్యమని మంత్రి పొంగులేటి అన్నారు. భూభారతి చట్టం పెద్దపెద్ద దళారులను భ్రష్టు పట్టే ప్రయత్నం చేస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు చట్టం చేస్తుందే తప్ప, దానిని అమలు భాధ్యత అధికారులే అని అన్నారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా అధికారులు సేవలందించాలని అన్నారు.
ప్రజలు రాష్ట్రంలో అటు అన్నదాతలకు, ప్రజలకు సమానమైన ప్రశాంతపాలనను కోరుకున్న ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని అదే ఇందిరమ్మ రాజ్యమని మంత్రి అన్నారు.

Also Read: Damodara Rajanarsimha: సిజేరియన్‌ ఆడిట్లపై కఠిన చర్యలు.. సి సెక్షన్లపై కఠిన ఆడిట్.. మంత్రి హెచ్చరిక!

రాష్ట్రంలో పేదల కన్నీటిని తూడువడానికే భూభారతి చట్టం తీసుకొచ్చామని అన్నారు. గతంలో ప్రభుత్వం ఎప్పుడైన రెవెన్యూ సదస్సులు కాని, సమస్యలపై ప్రజలను మట్లాడనిచ్చే వారు కాదని అన్నారు. షాదాబైనామా,సమస్యను గతంలో పరిష్కారం కాకుండా ధరణి తెచ్చారని, ఇప్పుడు అన్నింటికి కలిపి ఓకే గొడుగు కింద సమస్యలు పరిష్కరించే విధంగా భూభారతి చట్టం తెచ్చామని మంత్రి పొంగుటి అన్నారు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..