Viral Video: ప్రస్తుతం, సోషల్ మీడియా ( Social Media )ను విపరీతంగా వాడుతున్నారు. ఖాళీ సమయం దొరికితే చాలు.. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్ లో వీడియోస్ చూస్తూ.. వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. మరి ముఖ్యంగా, రీల్స్ అనే ఫీచర్ వచ్చాక ఒక్కొక్కరు తమకున్న టాలెంట్ ను బయట పెడుతున్నారు.
ప్రపంచనలుమూలల్లో(World) ఏం జరిగినా స్మార్ట్ ఫోన్లో క్షణాల్లో వచ్చేస్తుంది. ఇలా రోజు నెట్టింట కొన్ని లక్షల వీడియోలు ( Viral Videos ) అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని బాగా వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా ఓ పిల్లాడికి సంబందించిన వీడియో ఇంటర్నెట్ నే షేక్ చేస్తుంది. ఇది చూశాక .. మీరు కూడా షాక్ అవ్వడం పక్కా..! ఇంతకీ , ఆ బాబు ఏం చేశాడో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: MP Chamala Kiran Kumar: తెలంగాణ ఎంపీ చామల సూపర్ రికార్డ్.. మారు మ్రోగుతున్న ఢిల్లీ.. అదేంటంటే?
ఈ ప్రపంచంలో మనకి తెలియనవి చాలానే ఉన్నాయి. వాటిని చూసినప్పుడు ఇది నిజమేనా.. ఇలా చేయడం సాధ్యమేనా అని అనుకుంటాము. అయితే, ఇప్పటి వరకు ఎన్నో వీడియోలు చూశాము. అయితే, ఇలాంటి వీడియో ఎక్కడ కూడా చూసి ఉండరు. బండి చైన్ తో ఓ వ్యక్తి గోడ గడియారాన్ని ( World Clock ) తయారు చేశాడు. ఏంటి షాక్ అవుతున్నారా ? ఇది నిజమే. తండ్రి కొడుకులు కలిసి ఈ ప్రయోగాన్ని చేశారు. ఇంత వరకు ఏ శాస్త్రవేత్తలకు రాని ఐడియా వీరికెలా వచ్చిందని సందేహిస్తున్నారా? ప్రయత్నిస్తే రానిది అంటూ ఏం ఉండదని వీరిద్దరూ నిరూపించారు. వారు సోషల్ మీడియాలో దీనికి సంబందించిన వీడియో షేర్ చేసి ” హలో ఫ్రెండ్స్ మా నాన్న గారు, నేను గడియారాన్ని బండి చైన్ తో తయారు చేశాము. నచ్చితే, లైక్ చేయండి ” అంటూ ఆ పిల్లవాడు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం, ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
దీని మీద నెటిజన్స్ రక రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. రక రకాలుగా ” గ్రేట్ తమ్ముడు, నాన్న మీరు కలిసి ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలి ” అని కొందరు అంటుండగా, మీ నాన్న గారు చేసిన నేనే చేశానని చెప్పుకోలేదు ఆయన మంచితనానికి మేము ఫిదా అయ్యామని ఇంకొందరు కామెంట్స్ చేశారు. సూపర్ బ్రో, నువ్వు ఒక ఇంజీనీర్ కావాలి చిన్న, ఇలాగే ప్రయత్నిస్తూనే ఉండు అంటూ ఓ యూజర్ వ్యాఖ్యానించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు