MP Chamala Kiran Kumar: భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మొట్టమొదటిసారిగా పార్లమెంటుకు ఎంపికైన నాటి నుండి పార్లమెంట్లో తనదైన మార్కును చూపిస్తూ ప్రజా సమస్యలపై గలమెత్తి అధికార పక్షానికి ముచ్చటలు పట్టించారు. పార్లమెంట్ కు ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు పార్లమెంట్ అన్ని సమావేశాలకు హాజరైతు 100% హాజరుతో మొదటి స్థానంలో నిలిచిన యువ నాయకుడు భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి.
అలాగే 95% తో రెండవ స్థానంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. భువనగిరి ఎంపీ చామల పార్లమెంట్లో 79 ప్రశ్నలు సంధించి రెండవ స్థానంలో ఉండగా మొదటి స్థానంలో 80 ప్రశ్నలతో ఈటల రాజేందర్ ఉన్నారు, ఇక చర్చల విషయానికి వస్తే 17 చర్చలతో రెండవ స్థానంలో ఉండగా అసదుద్దీన్ ఒవైసీ 21 చర్చలతో మొదటి స్థానంలో ఉన్నారు తెలంగాణకు రావలసిన నిధుల గురించి అధికార పార్టీని నిలదీస్తూ 79 ప్రశ్నలు సంధించారు.
Also Read: CM Revanth Reddy: ఆ రోజు నుంచే సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన.. షెడ్యూల్ ఖరారు!
భువనగిరి, ఆలేరు, జనగాం నుంచి సికింద్రాబాద్ వరకు అప్ అండ్ డౌన్ చేస్తున్న కార్మికులు, ఉద్యోగులు మరియు ప్రయాణికుల కోసం కొన్ని స్టేషన్లో ట్రైన్లు ఆగడం లేదు వాటిని ఆపాలని, అలాగే రైల్వే అండర్ పాస్ లు హైదరాబాద్ నుండి రాయిగిరీ (యాదగిరిగుట్ట) వరకు ఎంఎంటిఎస్, పోచంపల్లి లోని చేనేత కార్మికుల ఇక్కత్ సమస్యల పై పార్లమెంట్లో ప్రశ్నించారు.c