Gold Rates: గత కొద్దీ రోజుల నుంచి బంగారం చుక్కలు చూపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు గోల్డ్ కి (Gold Rate ) అధిక ప్రాధాన్యతను ఇస్తారు. మన ఇళ్ళలో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారానికి సంబందించిన చిన్న వస్తువైనా ఉంటుంది. కాబట్టి రేటు తగ్గినా, పెరిగిన కొందరు తప్పకుండా కొనుగోలు చేస్తారు.
ఇక ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు మహిళలు వారం ముందు నుంచే ఈ హారం కొనాలి, ఆ నెక్లెస్ కొనాలంటూ హడావుడి చేస్తుంటారు. వారి చీరల మీద సెట్ అయ్యే బంగారు ఆభరణాలు పెట్టుకుని మురిసిపోతుంటారు.
అయితే, గత రెండు నెలల నుంచి పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఒక రోజు ఆల్ టైం హై కి రీచ్ అవుతున్నాయి. ఇంకో రోజు భారీగా తగ్గి, సామాన్యులకు ఆశ చూపి అందకుండా పోతుంది. ఎన్నడూ లేనిది ఈ ఏడాదే ఇలా ధరలు పెరగడం ఏంటి అంటూ బంగారం ప్రియులు తలలు పట్టుకుంటున్నారు. అసలు, గోల్డ్ రేట్స్ ఎందుకు పెరుగుతున్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Jupally Krishna Rao: 8 లక్షల కోట్ల అప్పులు.. గత ప్రభుత్వ వైఫల్యాలు బహిర్గతం చేసిన మంత్రి!
పెళ్లిళ్ల సీజనే కారణమా?
ఈ నెలలో పెళ్లిళ్లు ఎక్కువ ఉండటంతో ధరలు ఇలా అమాంతం పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్లో ఎంతో కొంతో బంగారం రేటు పెరగడం సహజం. మరి, ఇంతలా పెరగడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం, రూ. 96,180 గా ఉంది. త్వరలో లక్ష వరకు వెళ్లినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొన్నారు.
గోల్డ్ ధర రూ. లక్ష దాటే అవకాశం
భారత్ ఉత్పత్తులపై 27 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. దీని వలన బంగారం పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ముందే అంచనా వేశారు. ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ సుంకాల వలనే బంగారం ధరలు రెక్కలొచ్చాయి. గత నెలతో పసిడి ధర పోల్చుకుంటే 8 శాతం పెరిగి గోల్డ్ లవర్స్ కు చుక్కలు చూపిస్తుంది. రాబోయే రోజుల్లో రూ.లక్ష దాటొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక, గోల్డ్ ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు. కొత్త ఏడాది తగ్గుతుందేమో అని భావించారు. కానీ, అందనంత ఎత్తుకి చేరుకున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా పెరిగిన బంగారం ధర
అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా గోల్డ్ రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ ధర 3,300 డాలర్లు. ఈ రోజు రేటు ఒకసారి గమనిస్తే, 10 గ్రాముల బంగారం ధర రూ.99,700 గా ఉంది. త్వరలో రూ.లక్షకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ ఏడాది చివరికి గోల్డ్ రేట్ రూ.1.25లక్షలు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ ని క్లిక్ చేయగలరు