మంథని స్వేచ్ఛ: Minister Sridhar Babu: రైతును రాజును చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మంథని వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ తమ ప్రభుత్వం రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్ తదితర పథకాలను అమలు చేసి రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిందని అన్నారు. ఖరీఫ్ సీజన్ లో రైతులకు బోనస్ చెల్లింపు పూర్తి చేశామని, ఈసారి అదే విధానం ఉంటుందన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడా ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.
Also Read: TDP Alliance Govt: సీఎం చేతిలో అవినీతి చిట్టా.. ఆ నాయకుల పని పడతారా?
గత బీఆర్ ఎస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు వరి ధాన్యం 4కిలోల కోత విధించిందని, తమ కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యంలో గింజ కటింగ్ లేకుండా ధాన్యం డబ్బులు చెల్లించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పక్షపాతి అన్నారు. రైతుల అవసరం మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు.
మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఖరీఫ్ సీజన్ లో సహకార సంఘం ద్వారా3,69,823.60 క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేయగా, 4812 మంది రైతుల నుంచి సేకరించిన 3,42,396.40క్వింటాళ్ల సన్న ధాన్యానికి రూ.17.11 కోట్లను బ్యాంక్ ఖాతాల్లో బోనస్ జమ చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ నరేష్, ఏఎంసి సెక్రటరీ సతీష్ కుమార్, సంఘ కార్యదర్శి అశోక్ కుమార్, డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/