Tirumala News (image credit:TTD)
తిరుపతి

Tirumala News: వైభవంగా తుంబురు తీర్థ ముక్కోటి.. తీర్థ స్నానమాచరించిన 14,500పైగా భక్తులు

Tirumala News: తిరుమలలోని శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థంగా భాసిల్లుతున్న తుంబురు తీర్థ ముక్కోటిలో దాదాపు 14,500 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. ఏప్రిల్ 11న సుమారు 3,500 మంది, ఏప్రిల్ 12న 11వేల మంది భక్తులు తీర్థ స్నానం ఆచరించారు. ఈ తుంబురు తీర్థ ముక్కోటిలో తీర్థస్నానం ఆచరిస్తే కలిగే భాగ్యం అమోఘం. అందుకే భక్తులు కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి సైతం తరలివచ్చారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేసింది.

టీటీడీ విస్తృత ఏర్పాట్లు
టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదేశాల మేరకు అధికారులు తుంబురు తీర్థానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 5 గంట‌ల నుండి నిరంత‌రాయంగా అన్న ప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు భక్తులకు శ్రీవారి సేవకులు పంపిణీ చేశారు.

ఇంజినీంగ్‌ విభాగం ఆధ్వర్యంలో భక్తులు భోజనం చేసేందుకు వీలుగా అవసరమైన షెడ్లు, మార్గమధ్యంలో నిచ్చెనలు, తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేశారు. దీర్ఘకాలిక వ్యాధులు, ఆస్తమా, స్థూల కాయం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారిని తీర్థానికి అనుమతించలేదు. పాప వినాశనం వద్ద పార్కింగ్ సమస్య కారణంగా భక్తులను ఆర్టీసీ బస్సులలో మాత్రమే అనుమతించారు. తుంబురు తీర్థానికి అటవీ మార్గంలో వెళ్ళే సమయంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రేడియో మరియు బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగం ఆధ్వర్యంలో నిరంతరాయంగా ప్రకటనలు చేశారు.

ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తుంబురు తీర్థం, పాపావినాశనం వద్ద పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ అదనపు సిబ్బందిని నియమించారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు సేవలందించేందుకు అంబులెన్స్‌లను, పారామెడికల్‌ సిబ్బందిని అవసరమైన మందులు అందుబాటులో ఉంచారు. మరోవైపు టీటీడీ భద్రతా విభాగం, పోలీసులు, అటవీశాఖ సిబ్బంది కలసి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

Also Read: Pink Moon 2025: మరికాసేపట్లో అద్భుతం ఆవిష్కృతం.. చూడకుంటే బాధపడాల్సిందే!

టీటీడీ కల్పించిన అన్నప్రసాదాలు, తాగునీరు, ఇతర ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. టీటీడీ చేసిన ఏర్పాట్లను డిప్యూటీ ఈవో రాజేంద్ర, వీజీవో సురేంద్ర, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మధుసూదన్, వైద్య అధికారి డాక్టర్ కుసుమ కుమారి, తదితరులు పర్యవేక్షించారు.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?