Viral Video: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో సమాజానికి పనికొచ్చేవి కొన్నైతే, కొన్ని మాత్రం చూడటానికే భయంకరంగా ఉంటాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు తమ టాలెంట్ ను ప్రపంచానికి తెలియజేయడం కోసం సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుంటున్నారు. అయితే, తాజాగా ఎక్స్ వేదికగా వీసీ సజ్జనార్ ఒక వీడియోను ట్విట్టర్ లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం, ఈ వార్త బాగా వైరల్ అవుతోంది.
వీసీ సజ్జనార్ ఎక్స్ లో ” పిల్లల విషయంలో తల్లిదండ్రుల అతి గారాబం పనికి రాదని అన్నారు. చిన్నతనం నుంచే వారితో ఇలాంటి ప్రమాదకర సాహసాలు పనులు చేయిస్తూ.. ఏం నేర్పిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. జరగరాని ప్రమాదం జరిగితే దీని ఎవరు బాధ్యులు అని అన్నారు. చిన్న పిల్లలకు తల్లి దండ్రులు ఇవేనా నేర్పించేదంటూ ” సజ్జనార్ ట్వీట్ లో రాసుకొచ్చారు.
Also Read: Sodaraa: సంపూ సినిమాని పవన్ కళ్యాణ్ సినిమాతో పోల్చిన నిర్మాత.. మ్యాటర్ ఏంటంటే?
ఇటీవలే చిన్న పిల్లలు బైక్స్ నడుపుతూ రోడ్ల మీద కనిపిస్తున్నారు. ఇలా నడుపుతున్న సమయంలో కొందరికి ప్రమాదాలు కూడా జరిగాయి. ప్రమాదం జరిగాక ఎవరూ ఏం చేయలేరు. కాబట్టి చిన్న పిల్లలకు వాహనాలు నేర్పించడడం వంటి పనులు అస్సలు చేయకండి. వీసి సజ్జనార్ షేర్ చేసిన వీడియోలో చిన్న పిల్లోడు జీప్ అంత కూడా లేడు. దాన్ని డ్రైవ్ చేస్తూ రౌండ్స్ మీద రౌండ్స్ వేస్తూ నడుపుతున్నాడు. ఈ వీడియో పై రియాక్ట్ అయిన నెటిజన్స్ ” చిన్న పిల్లలకు ఇలాంటివి ఎందుకు నేర్పిస్తున్నారు, పలక పట్టుకోవాల్సిన చేతులతో స్టీరింగ్ పట్టుకుని తిప్పుతున్నాడు.. ఇవేనా నేర్పించేదంటూ ” ఫైర్ అవుతున్నారు. ఇంకొందరు ” ముందు ఆ పిల్లాడి తల్లి దండ్రులను పట్టుకుని అరెస్టు చేయండి. అప్పుడు అందరికి అర్థమవుతుందని సలహా ” ఇస్తున్నారు.