Sodaraa Trailer Launch Event
ఎంటర్‌టైన్మెంట్

Sodaraa: సంపూ సినిమాని పవన్ కళ్యాణ్ సినిమాతో పోల్చిన నిర్మాత.. మ్యాటర్ ఏంటంటే?

Sodaraa: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu) నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. ఈ మధ్య సంపూ సినిమా చేయడం తగ్గించాడు. కానీ ఇకపై వరుస సినిమాలతో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆయన నటించిన ఓ సినిమాను, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘బ్రో’ (Pawan Kalyan Bro Movie) సినిమాతో పోల్చేశాడు టాలీవుడ్‌కు చెందిన ఓ కల్ట్ నిర్మాత. అంతే, ఒక్కసారిగా ఈ ‘సోదరా’ చిత్రం వార్తలలో హైలెట్ అవుతోంది. ఇంతకీ ఆ నిర్మాత ఎవరు? ఎలా పోల్చాడు? అనే విషయంలోకి వస్తే..

వైవిధ్యమైన సినిమాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్న హీరో సంపూర్ణేష్‌ బాబు. ఈ సారి అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ‘సోదరా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతో పాటు సంజోష్‌ కూడా ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీబంసాల్, ఆరతి గుప్తా.. నటిస్తున్న ఈ చిత్రానికి మోహన్ మేనంపల్లి దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకుని, నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 25న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు సాయి రాజేష్‌, కల్ట్‌ నిర్మాత ఎస్‌కేఎస్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Also Read- Hari Hara Veera Mallu: ‘వీరమల్లు’పై ఇంకా డౌట్సా? ఈ క్లారిటీ సరిపోతుందా?

ఈ కార్యక్రమంలో ఎస్‌కేఎన్‌ (Cult Producer SKN) మాట్లాడుతూ, నాకు సంపూ అంటే చాలా ఇష్టం. అందుకే ఈ ఫంక్షన్‌కు వచ్చాను. సంపూకు సాయిరాజేష్‌ అంటే చాలా ఇష్టం. అందరూ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ కావాలి. ఈ సినిమాతో సంజోష్‌కు కూడా బ్రేక్‌ రావాలి. కంటెంట్ నమ్మి తీసే ఇలాంటి సినిమాలు ఆడితే మంచి కిక్ వస్తుంది. చిన్న సినిమాలు బాగుండాలని, బాగా ఆడాలని కోరుకునే వ్యక్తిని నేను. ఇలాంటి ఫంక్షన్‌లకు రావడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను. సీనియర్‌ నటుడు బాబుమోహన్‌ ఈ సినిమాలో నటించినందుకు హ్యపీగా ఉంది. ఈ ‘సోదరా’ సినిమా పవన్‌ కల్యాణ్‌ ‘బ్రో’ సినిమాలా ఘన విజయం సాధించాలని, అందరికి మంచి గుర్తింపు, పేరు.. నిర్మాతకు డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను నేను థియేటర్‌లో ఒక షో బుక్‌ చేసుకోని, మా ఫ్రెండ్స్‌ అందరికి చూపిస్తాను. ఇలాంటి చిన్న సినిమాలను నా వైపు నుంచి ప్రోత్సాహించాలనే బాధ్యత నాపై ఉందని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంటున్నానని అన్నారు.

సాయి రాజేష్‌ (Sai Rajesh) మాట్లాడుతూ.. ఎస్‌కేఎన్‌ స్పీచ్‌ విన్న తరువాత ఎమోషన్ అయ్యాను. ఎస్‌కేఎన్‌ మంచి మనసు నాకు తెలుసు. ఈ సినిమాను ఎంకరైజ్‌ చేయడానికి తాను ఓ షోను ఏర్పాటు చేస్తానని చెప్పడం నిజంగా గొప్ప విషయం. ఈ సినిమా అందరికి మంచి విజయం అందించాలి. నాకూ, సంపూకి ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. సంపూతో నేను సినిమా తీసి 13 ఏళ్లు అయ్యింది. ‘హృదయ కాలేయం’ సూపర్‌హిట్‌ తర్వాత సంపూ నన్ను ఆర్థికంగా చాలా ఆదుకున్నాడు. నాకు ఓ కారు, ఇల్లును.. అతను పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌ కట్టి ఇప్పించాడు. సినిమా ఎన్నో మ్యాజిక్స్ చేస్తుంది. సంపూను చూస్తే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. తాను సంపాందించుకున్న డబ్బులో ఎంతో కొంత సహాయం చేస్తుంటాడు. సంపూ నా దృష్టిలో స్టార్‌. ఏ రోజుకైనా మేమిద్దరం ఒకరికొకరం ఉంటాం. ఈ సినిమా సంపూ కెరీర్‌లో మంచి విజయం సాధించాలని అన్నారు.

Also Read- OTT Movies: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీస్.. ఎక్కడ చూడచ్చంటే?

ఈ సినిమాను ఓ పిక్నిక్‌లా చేశాం, మంచి కుటుంబ అనుబంధాలతో ఈ సినిమా ఉంటుంది. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇదని బాబు మోహన్ (Babu Mohan) చెప్పారు. సంపూర్ణేష్‌ బాబు మాట్లాడుతూ.. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన సాయి రాజేష్ ఈ వేడుకకు రావడం హ్యపీ. అప్డేట్ అయిన తమ్ముడు, అమాయకుడైన అన్న మధ్య జరిగే స్వచ్ఛమైన కథ ‘సోదరా’. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కంటెంట్‌కు మంచి స్పందన వచ్చింది. నేను రియల్‌లైఫ్‌లో ఎలా ఉంటానో అలాంటి పాత్రే ఈ సినిమా లభించినందుకు సంతోషంగా ఉంది. అందరూ ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇంకా చిత్రయూనిట్ ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?