OTT Movies: ఈ మధ్య చాలా మంది ఓటీటీలో సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రీసెంట్ గా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేసిన చిత్రాలు ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. తమిళం, మలయాళం,తెలుగు, హిందీ, కన్నడ భాషలలో సూపర్ హిట్ అయిన చిత్రాలు ఇప్పుడు మన ముందుకొచ్చాయి. అయితే, అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న కోర్ట్, ఛావా, పెరుసు మూవీస్ ఓటీటీలోకి వచ్చేశాయి. మరీ, ఏ సినిమా ఎక్కడ చూడచ్చొ ఇక్కడ తెలుసుకుందాం..
కోర్ట్ (Court )
ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకులకు ముందుకొచ్చిన భారీ విజయం సాధించిన సినిమా ” కోర్ట్ “. హీరో కమ్ కమెడియన్ ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇక, ఇప్పుడు ఈ మూవీ ఈ రోజు అర్ధరాత్రి నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.
Also Read: New Ration cards: అధికారుల నిర్లక్ష్యంతో తీవ్రమైన తప్పిదాలు ..దరఖాస్తు ఓ చోట.. పేర్ల నమోదు మరో చోట
ఛావా ( Chhaava )
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ రష్మిక మందన్నా కలిసి నటించిన మూవీ ” ఛావా ” . ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం రూ.700 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. ముఖ్యంగా, విక్కీ కౌశల్ తన నటనతో అందర్ని ఆకట్టుకున్నాడు. అయితే, ఈ సినిమా కూడా ఈ రోజు అర్ధరాత్రి నుంచి నెట్ ఫ్లిక్స్ లోకి స్ట్రీమ్ అవుతోంది.
పెరుసు (Perusu)
కోలీవుడ్‌లో చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘పెరుసు’ (Perusu) సినిమా పెద్ద హిట్ గా నిలిచింది. అయితే, ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడీ చేస్తుంది. దీనిలో హీరో వైభవ్‌తో(Vaibhav) పాటు సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నిహారిక(Niharika NM)కూడా నటించింది. తాజాగా, ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ మూవీకి ఇళంగో రామ్ దర్శకత్వం వహించారు.