Jupally Krishna Rao [image credit: swetcha reporter[
తెలంగాణ

Jupally Krishna Rao: పర్యాటకంలో రూ.15 వేల కోట్ల లక్ష్యం.. 2030 నాటికి 3 లక్షల ఉద్యోగాలు.. మంత్రి జూప‌ల్లి

Jupally Krishna Rao: తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన నూత‌న ప‌ర్యాట‌క విధానంతో దేశంలో ఎక్క‌డ లేని విధంగా ఆతిధ్య రంగంలో అనుకూల‌మైన వాతావ‌ర‌ణం ఏర్ప‌డింద‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు.  ముంబాయి పోవై లేక్ లో జ‌రిగిన‌ ద‌క్షిణాసియా 20వ హోట‌ల్స్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫ‌రెన్స్ లో ఆయన పాల్గొన్నారు. ప్ర‌ఖ్యాత హోట‌ల్స్, ట్రావెల్స్ సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో భేటీ అయ్యారు.

తెలంగాణ ఆతిధ్య రంగంలో పెట్టుబ‌డులు పెట్టి ప‌ర్యాట‌క అభివృద్ధిలో భాగ‌స్వాములు కావాల‌ని ఆహ్వానించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్ షిప్ (పీపీపీ) విధానం ద్వారా పర్యాటకాభివృద్ధి చేయాలని భావిస్తున్నామని, పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చే పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున మెరుగైన రాయితీలు, ప్రోత్సాహకాలను కల్పించి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని భరోసానిచ్చారు.

 Also Read: CS Shanti Kumari: శాంతికుమారికి షాక్ తప్పదా? కొత్త సీఎస్ పోస్టు ఎవరిది?

జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు తొలి గమ్యస్థానంగా తెలంగాణ‌ను నిలబెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పర్యాటకులను ఆకర్షించేలా రాష్ట్రంలో టెంపుల్, అడ్వెంచర్, ఎకో, హెరిటేజ్, మెడికల్, వెల్ నెస్ టూరిజంను అభివృద్ధి చేసేలా నూత‌న ప‌ర్యాట‌క విధానాన్ని రూపొందించామ‌ని వివ‌రించారు. రాష్ట్రంలో 2030 నాటికి రూ. 15 వేల కోట్ల పెట్టుబడుల సమీకరణ, 3 లక్షల ఉద్యోగాల కల్పన, రెట్టింపు వృద్ధి, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య ఆధారంగా తెలంగాణను దేశంలో మొదటి ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా నిలపాలనే ఆశ‌యంతో ప‌ని చేస్తున్నామ‌ని పేర్కొన్నారు .

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

IAS Shailaja Ramaiyer: కమిషనర్ శైలజా రామయ్యర్ కు కీలక బాధ్యతలు..?

Mahabubabad District: యూరియా టోకెన్ల కోసం కిక్కిరిసి పోయిన రైతులు.. ఎక్కడంటే..?

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

Gadwal District: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం.. నది ప్రవాహంలో బాలుడు గల్లంతు

Bigg Boss 9 Telugu Promo: డబుల్ హౌస్ తో.. డబుల్ జోష్ తో.. ప్రోమో అదిరింది గురూ!