Khammam Collector [ image credit: Swetcha reporter
ఖమ్మం

Khammam Collector: మామిడి రైతులకు గుడ్ న్యూస్.. ఈ ఉత్పత్తులతో ప్రజలకు ఆరోగ్యం.. జిల్లా కలెక్టర్

Khammam Collector: సేంద్రీయ పద్దతుల్లో సాగు చేసిన పంట ఉత్పత్తుల వినియోగం వల్ల మనకు మెరుగైన ఆరోగ్యం లభిస్తుందని జిల్లా కలెక్టర్ (Muzammil khan) ముజమ్మిల్ ఖాన్ అన్నారు. స్థానిక గ్రాండ్ గాయత్రి హోటల్ లో జరిగిన మామిడి పండ్ల కొనుగోలు, అమ్మకందారుల సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో కూడా లాభదాయక వ్యవసాయం నడవడం లేదని, అమెరికా, ఇంగ్లాండ్, రష్యా, యూరోప్ లాంటి దేశాలలో కూడా ప్రభుత్వ సబ్సిడీ 90 శాతం వరకు ఉంటేనే వ్యవసాయం చేయగలుగుతున్నారని, నేటికీ వారి ఆహారం కూడా చాలా వరకు మన దేశం నుంచి వెళుతుందని తెలిపారు.

 Also Read: CS Shanti Kumari: శాంతికుమారికి షాక్ తప్పదా? కొత్త సీఎస్ పోస్టు ఎవరిది?

అభివృద్ధి అంటే కేవలం పరిశ్రమలు, ఉత్పత్తి రంగాలు మాత్రమే కాదని, మనమంతా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చామని, వ్యవసాయాన్ని మరిచిపోతే మన అస్తిత్వం కోల్పోతామని అన్నారు. వ్యవసాయం ఉంటేనే మనకు ఆహార భద్రత ఉంటుందని, 50 సంవత్సరాల క్రితం దేశంలో ఆహార సంక్షోభం ఉండేదని, అమెరికా వంటి దేశాలు అందించే ధాన్యంపై ఆధార పడ్డామని, హరిత విప్లవం తర్వాత దేశం ఆహార స్వాలంభన సాధించిందని కలెక్టర్(Muzammil khan) తెలిపారు.

ఆరోగ్యంగా కూడా మన దేశం ఎదగాలని, మన పూర్వీకులు చాలా ఆరోగ్యంగా ఉన్నారని, మన జనరేషన్ లో మాత్రం ఆరోగ్యం తగ్గిపోతుందన్నారు. సేంద్రీయ వ్యవసాయం ప్రస్తుతం చాలా అవసరమన్నారు. ఎరువులు, మందులు వాడకుండా పండించిన వ్యవసాయ పంటలు ఆరోగ్యంగా ఉంటాయన్నారు.

మార్కెట్ లో రైతులకు మంచి రేటు అందించాలని, రైతులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నామని, రైతు ఒత్తిడితో తన పంట అమ్మకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఖమ్మం (Khammam) జిల్లాలో వారం రోజులలో మామిడి పండ్ల అమ్మకం కోసం తాత్కాలిక మార్కెట్ ఏర్పాటు చేస్తామని, రైతులు నేరుగా వినియోగదారులకు పండ్లు అమ్ముకోవచ్చన్నారు.

 Also Read: Trump Tariffs: మామిడి రైతులకు గుడ్ న్యూస్.. వాటిపై సుంకాలుండవు!

రాబోయే సంవత్సరంలో మార్కెటింగ్ సీజన్ సమయానికి జిల్లా మంత్రితో చర్చించి శాశ్వతంగా మామిడి పండ్ల మార్కెట్ ఏర్పాటుకు కృషి చేస్తామని కలెక్టర్(Muzammil khan) అన్నారు.మధ్యవర్తులను వీలైనంత మేరకు తగ్గిస్తూ అధిక లాభం రైతులకు చేకూరేలా కృషి చేస్తామన్నారు.

రైతులకు అర్థమయ్యేలా వ్యవసాయ అధికారులు సూచనలు జారీ చేయాల్సి ఉంటుందని, ప్రతి నెలా జిల్లాలో రైతు సదస్సులు పొలాల్లో పెట్టుకోవాలని, బాగా పంటలు పండిస్తున్న రైతుల దగ్గరకు ఇతర రైతులను తీసుకుని వెళ్తున్నామన్నారు.

కార్యక్రమంలో సమావేశానికి సంబంధించి బ్రోచర్ ను కలెక్టర్ ((Muzammil khan) ఆవిష్కరించారు. అధికారులు మామిడి సాగు, కోతలు, సస్యరక్షణ, మార్కెటింగ్ పై అవగాహన కల్పించారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు.ఈ కార్యక్రమంలో రైతు కమీషన్ సభ్యులు రాంరెడ్డి గోపాల్ రెడ్డి, హార్టికల్చర్ జెడి బాబు, ఆపేడ మేనేజర్ నాయుడు, యూనివర్సిటీ డైరెక్టర్ కిరణ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..