Ghatkesar fraud(image credit:X)
హైదరాబాద్

Ghatkesar fraud: కమీషన్​ కోసం కక్కుర్తి పడి… కటకటాల్లోకి!

Ghatkesar fraud: రిఫరల్​ కమీషన్​ కోసం కక్కుర్తి పడి ఓ వ్యక్తి కటకటాల పాలయ్యారు. సీఐడీ డీజీ శిఖా గోయల్​ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వందిత అనే మహిళ అడ్మినిస్ట్రేటర్​ గా ఫనుక్​ రొటోటిక్​ ఆన్​ లైన్​ ఇన్వెస్ట్​ మెంట్​ కంపెనీ రెండు వాట్సాప్ గ్రూపులను ప్రారంభించింది.

వీటిల్లో సభ్యులుగా చేరి పెట్టుబడులు పెడితే దండిగా లాభాలు సంపాదించుకోవచ్చంటూ ప్రచారం చేసింది. ఈ క్రమంలో ఘట్​ కేసర్​ నివాసి మధుసూదన్​ ఈ గ్రూపుల్లో సభ్యునిగా చేరి 2.20లక్షల రూపాయలు పెట్టుబడులుగా పెట్టాడు. ఈ క్రమంలో కంపెనీ అతనికి రోజువారీగా లాభాలు వచ్చాయంటూ కొన్ని చెల్లింపులు చేసింది.

ఆ సమయంలో కొత్తవారిని వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులుగా చేర్పిస్తే కంపెనీ 11శాతం కమీషన్​ గా ఇస్తుందని మధుసూదన్ కు తెలిసింది. ఇదే విషయాన్ని అడుగగా వందిత కమీషన్​ ఇస్తామని చెప్పింది. దాంతో ఆమె సూచనల మేరకు నేరెడ్​ మెట్​ లోని 1980మిలటరీ హోటల్​ లో పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసిన మధుసూదన్​ పదుల సంఖ్యలో జనాన్ని వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులుగా చేర్పించారు. మూడు నుంచి నాలుగు వందల శాతం లాభాలు వస్తాయంటూ వారితో 22.69 లక్షల రూపాయలను పెట్టుబడులుగా పెట్టించాడు.

Also read: Drug Mafia In Dhoolpet: ఆపరేషన్ ధూల్‌పేట్.. డ్రగ్ మాఫియాకు షాక్!

మధుసూదన్​ చెప్పిన మాటలు నమ్మి ఇలాగే పెట్టుబడులు పెట్టిన రాబిన్​ వినయ్​ కుమార్​ అనే బాధితుడు లాభాలు రాకపోవటంతో సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన డీఎస్పీ వెంకటేశ్వర్లు సిబ్బందితో క​లిసి మధుసూదన్​ ను మంగళవారం అరెస్ట్​ చేసి జైలుకు రిమాండ్​ చేశారు.

 

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ