Drug Mafia In Dhoolpet [image credit; swetcha reporter]
హైదరాబాద్

Drug Mafia In Dhoolpet: ఆపరేషన్ ధూల్‌పేట్.. డ్రగ్ మాఫియాకు షాక్!

Drug Mafia In Dhoolpet: ధూల్​ పేట్​ కేంద్రంగా అడ్డూ అదుపు లేకుండా కొనసాగుతున్న గంజాయి దందాపై ఎక్సయిజ్​ ఎన్​ ఫోర్స్ మెంట్​ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్​ ఫోర్స్​ మెంట్​ డైరెక్టర్​ వీ.బీ.కమలాసన్​ రెడ్డి ఆదేశాల మేరకు స్టేట్​ ఎక్సయిజ్​ టాస్క్​ ఫోర్స్​ అధికారులు నిరంతర దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో 250 రోజుల్లో 425మంది నిం దితులపై 102 కేసులు నమోదు చేశారు. వీరి నుంచి 401 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల్లో 327మందిని ఇప్పటికే అరెస్ట్​ చేసి జైళ్లకు రిమాండ్​ చేశారు. పరారీలో ఉన్న మిగితా వారి కోసం గాలిస్తున్నారు. ఒడిషాతోపాటు ఆంధ్ర, మహారాష్ట్రల నుంచి గంజాయి తెప్పిస్తున్న కొందరు ధూల్​ పేట్​ వ్యాపారులు దానిని నగరంలో విక్రయిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. దీనిని అడ్డుకోవటానికి ఎక్సయిజ్​ ఎన్​ ఫోర్స్​ మెంట్​ అధికారులు జూలై 17 నుంచి ఆపరేషన్​ ధూల్​ పేట్​ ప్రారంభించారు.

 Also Read: SLBC Tunnel Update: 46వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు.. అగాధంలో ఆశ కోసం పోరాటం!

పూర్తిగా నిర్మూలించే వరకు...
ధూల్​ పేట్​ లో గంజాయి దందాను పూర్తి స్థాయిలో నిర్మూలించే వరకు ఆపరేషన్​ ను కొనసాగిస్తామని ఎన్​ ఫోర్స్​ మెంట్​ డైరెక్టర్​ వీ.బీ.కమలాసన్ రెడ్డి చెప్పారు. ఇప్పటి వరకు నమోదైన 102 కేసుల్లో 58 ద్విచక్ర వాహనాలు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. దాంతోపాటు 147 మొబైల్​ ఫోన్లను సీజ్​ చేసినట్టు తెలిపారు.

13మంది నిందితులను బైండోవర్​ చేశామని, పరారీలో ఉన్న 85మంది నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని చెప్పారు. ధూల్​ పేట్​ కు చెందిన కొందరు గంజాయి వ్యాపారులు నగరంలోని ఇతర ప్రాంతాలకు దందాను విస్తరించారని తెలిపారు. ఆయా చోట్ల కూడా దాడులు చేస్తూ నిందితులను అరెస్ట్​ చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్​ చెప్పినట్టుగా గంజాయి, డ్రగ్స్​, నాన్​ డ్యూటీ పెయిడ్​ లిక్కర్​ ను పూర్తి స్థాయిలో అరికట్టటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!