Nalgonda district (image credit:Canva)
నల్గొండ

Nalgonda districtL: ఉరుములకు భయపడుతున్న రైతన్నలు.. చినుకు రాలితే.. అంతే సంగతులు!

Nalgonda district: ఓవైపు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వరికోతలు ఊపందుకున్నాయి. మరోవైపు అకాల వర్షం ముప్పు పొంచి ఉంది. ఆకాశంలో మేఘాలు తరచూ కమ్ముకుంటుండడం.. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఎక్కడ వరుణుడి పాలు అవుతుందేమోనన్న గుబులుతో అన్నదాతలు కంటినిండా నిద్రపోని పరిస్థితి. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం యాసంగి సీజన్ వరికోతలు మొదలయ్యాయి.

ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు ధాన్యం క్యూ కడుతోంది. తెలంగాణ సర్కారు ధాన్యం కొనుగోలు చేసేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 1053 కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో సగానికి పైగా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అయ్యాయి. కానీ ధాన్యం కొనుగోళ్లను పూర్తిస్థాయిలో మొదలుకాలేదు. ఇదే సమయంలో ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణం వర్షం పడుతుందో తెలియని పరిస్థితి.

ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చాలా ప్రాంతాల్లో అకాల వర్షం పడింది. పంట చేలల్లోనే ఉండడంతో నష్టం పెద్దగా లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఉన్నప్పటికీ భారీ వరద రాకపోవడంతో రైతాంగం ఊపిరీ పీల్చుకుంది. కానీ ఇంకా కోత కోయని పొలాల్లో ధాన్యం గింజలు అకాల వర్షానికి భారీగా నేలరాలాయి. అయితే ఇంకా వరికోతలు చేయాల్సిన పంట లక్షల ఎకరాల్లోనే ఉంది.ఇలాంటి సమయంలో వర్షం పడితే.. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యంతో పాటు పంట పొలాల్లోని ధాన్యం సైతం అన్నదాతలకు చేతికి అందకుండాపోవడం ఖాయమని చెప్పాలి.

ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాసంగి సీజన్‌లో 12.85 లక్షల ఎకరాల్లో వరి పంటను రైతాంగం సాగు చేసింది. నల్లగొండ జిల్లాలో 5,14,031 లక్షల ఎకరాల్లో 12.14 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. సూర్యాపేట జిల్లాలో 4,73,000 ఎకరాల్లో 12.05 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి, యాదాద్రి జిల్లాలో 2,98,912 ఎకరాల్లో 5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు.

అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 26.76 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం నల్లగొండ జిల్లాలో 375 కేంద్రాలు, సూర్యాపేటలో 308 కేంద్రాలు, యాదాద్రి జిల్లాలో 370 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇదిలావుంటే.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వారం పది రోజులవుతోంది.

Telangana govt: మత్స్యకారులకు గుడ్ న్యూస్.. దేశంలోనే అతిపెద్ద హోల్‌సేల్‌ మార్కెట్‌.. మీ ముందుకు..

అయినా ఇప్పటివరకు ఇంకా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ఓవైపు రైతులు వరికోతలు ముమ్మరం చేశారు. మరో 15 రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు భారీగా చేరుకుంటుంది. అయితే కొనుగోలు కేంద్రాల్లో మాత్రం పరిస్థితి దారుణంగా తయారయ్యింది. గోనె సంచులు, టార్ఫాలిన్ల కోరత వేధిస్తోంది. దీంతో అన్నదాతలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది.

దళారుల ఎంట్రీతో మారిన సీన్..
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ఎదురుచూడాల్సి రావడం.. ఓవైపు వరుణుడు తరుముతుండడంతో అన్నదాతల గుండెల్లో గుబులు మొదలయ్యింది. నిజానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే.. అన్నదాతలకు మంచి ధర వచ్చే అవకాశం ఉంది. కానీ రోజుల తరబడి ఎదురుచూడాల్సి రావడం సమస్యగా మారింది. కొనుగోలు కేంద్రాల్లో వసతులు లేక.. మరోవైపు వరుణుడు ముంచుకొస్తుండడంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది.

ఇదే అదునుగా దళారుల ఎంట్రీతో సీన్ మారిపోయింది. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి వెయిట్ చేయడం కంటే.. మిల్లుల్లో విక్రయిస్తే.. గంటల వ్యవధిలోనే ధాన్యం అమ్ముకోవచ్చంటూ రైతులకు దళారులు మాయ మాటలు చెబుతున్నారు. ధాన్యానికి సంబంధించిన డబ్బులు సైతం రెండు మూడు రోజుల్లోనే రైతుల చేతికి వస్తున్నాయి. దీంతో ఇదే బెటర్ అనే నిర్ణయానికి రైతులు వచ్చేస్తున్నారు. కానీ దళారులు క్వింటాల్ వరి ధాన్యానికి రూ.1800 మించి ధర పెట్టడం లేదు. కొనుగోలు కేంద్రాలతో పోల్చితే.. క్వింటాల్‌కు రూ.400 నుంచి రూ.500 వరకు తేడా ఉంటుంది.

Also Read: Mahesh Goud vs Bandi Sanjay: బండి సంజయ్ కు మహేష్ గౌడ్ వార్నింగ్.. అసలేం చెప్పారంటే?

సన్నకారు రైతు సగటున రూ.10వేల వరకు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఓ మోస్తరు స్థాయి రైతు అయితే నష్టం భారీగానే ఉంటుంది. ఇది అన్నదాతలకు పెద్ద దెబ్బేనని చెప్పాలి.ఆరుగాలం కష్టం చేసి పంట పండించి.. తీరా ధాన్యం అమ్ముకునే సమయంలో తగిన వసతులు లేకనో.. ధాన్యం అమ్మకాలు త్వరితగతిన కాకపోవడంతోనే దళారులకు అమ్ముకోవాల్సి రావడం నిజంగా మోసపోవడమేనని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు జిల్లా యంత్రాంగం.. అటు పాలకులు కాస్తంత దృష్టి పెట్టి కొనుగోళ్లు సజావుగా సాగేలా చూస్తే అన్నదాతలకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పాలి.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు