farmers [image credit; swetcha reporter]
నల్గొండ

farmers: నష్టపోతున్న రైతన్న .. ఆ కంపెనీ పట్టించుకునేనా?

farmers : సాగులో ఆదర్శంగా నిలుద్దామని ఆయిల్ ఫామ్ సాగు చేపట్టినా రైతాంగం అరిగోసలు పడుతున్నారు. సంప్రదాయ పంటలకు భిన్నంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొంతమంది రైతాంగం ఆయిల్ ఫామ్ సాగును చేపట్టారు. అయితే యాదాద్రిభువనగిరి జిల్లాలో పరిస్థితి కొంతమేర బాగున్నా.. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల ఆయిల్ ఫామ్ రైతుల బాధ వర్ణనాతీతం. మిగతా రైతులకు అదర్శంగా ఉండడంతో పాటు వినూత్నంగా ఆలోచించే రైతులను ఆయిల్ ఫామ్ సాగు కొత్త చిక్కుల్లోకి నెట్టింది. ఆశించిన దిగుబడి లేకపోవడం.. పంట సాగులో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రైవేటు కంపెనీ యాజమాన్యం చొరవ చూపకపోవడం వల్ల రైతులు విసిగివేసారి పోయారు.

ప్రైవేటు కంపెనీ నిర్వాకం పుణ్యమంటూ కొంతమంది రైతులు ఆయిల్ ఫామ్ చెట్లను ఐదారేండ్లకే పీకేశారు. అండగా నిలవాల్సిన సదరు కంపెనీ ప్రతినిధులు పైపైమెరుగులకే కన్పిస్తున్నారు తప్ప చిత్తశుద్ధితో ఆయిల్ ఫామ్ రైతులను కలిసేందుకు సుముఖత చూపకపోవడం కొసమెరుపు. నిజానికి ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందని ఉద్యానవన శాఖ ద్వారా ప్రచారం కల్పించింది.

 AlSO Read; Ganja Seized: ఇద్దరు డ్రగ్​ పెడ్లర్ల అరెస్ట్​ కుష్​ గంజాయి…ఎల్​ఎస్డీ బ్లాస్ట్​ డ్రగ్ సీజ్​

అందులో భాగంగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో సాగు చేపట్టేందుకు పతాంజలి కంపెనీ టెండర్ దక్కించుకుంది. యాదాద్రిభువనగిరి జిల్లాను ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్‌కు అప్పగించింది. వాస్తవానికి సూర్యాపేట, నల్లగొండ జిల్లాలు సైతం గతంలో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్‌కే కాంట్రాక్టు ఇచ్చింది. కానీ గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్‌ నుంచి ప్రైవేటు కంపెనీ అయిన పతాంజలికి కట్టబెట్టింది.

అప్పటివరకు నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో కొంతమేర ఆయిల్ ఫామ్ సాగు పరిస్థితి ఆశాజనకంగా ఉంది. కానీ ప్రైవేటు కంపెనీ చేతుల్లోకి వచ్చాక.. క్షేత్రస్థాయిలో రైతాంగానికి ఇబ్బందులు మొదలయ్యాయి. మొదట్లో ఆయిల్ ఫామ్ మొక్కల పంపిణీ టైమ్‌కు చేయకపోవడంతో ఆ తోటల సాగు ఆలోచననే రైతాంగం విరమించుకోవడం కొసమెరుపు. మరోవైపు నల్లగొండ జిల్లాలో 11వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తుండగా, దిగుబడి 500 ఎకరాల్లో వస్తుంది. సూర్యాపేట జిల్లాలో 5వేల ఎకరాల్లో సాగు చేస్తుండగా, దిగుబడి 250 ఎకరాల్లో వస్తుంది.

 Also Read: Khammam District: మా నాన్నే లేకుంటే.. ఆ జిల్లా కలెక్టర్ ఉద్వేగం

పదేండ్లుగా కంపెనీ ఏర్పాటు చేయలే..
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని ఆయిల్ ఫామ్ సాగు కాంట్రాక్టును ప్రభుత్వం పతాంజలి కంపెనీకి కట్టబెట్టింది. అయితే ఈ కంపెనీ రైతులకు క్షేత్రస్థాయిలో ఆయిల్ ఫామ్ సాగులో సహకారం అందించడంతో పాటు ఆయిల్ ఫామ్ గెలలను సదరు కంపెనీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో కంపెనీని సైతం నిర్మించాల్సి ఉంటుంది. కానీ పదేండ్లు కావొస్తున్నా.. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో కంపెనీని ఏర్పాటు చేయడంలో పతాంజలి విఫలమయ్యింది.

ఎప్పుడు అడిగినా.. ఇదే శంకుస్థాపన.. అదిగో శంకుస్థాపన అనడం మినహాయిస్తే.. ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇంకా భూసేకరణ ప్రక్రియ వద్ద కంపెనీ యాజమాన్యం నిలిచిపోయింది. ఫలితంగా ఆయిల్ ఫామ్ ఉత్పత్తులను విక్రయించేందుకు రైతులు మస్తు తిప్పలు పడుతున్నారు. ప్రస్తుతం రైతాంగం సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ గెలలను కలెక్షన్ సెంటర్ల ద్వారా పతాంజలి కంపెనీ ప్రతినిధులు సేకరిస్తున్నారు.

 Also Read: Jr NTR: ‘కంత్రీ’ లుక్.. ‘మ్యాడ్ స్క్వేర్’ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ని చూసి ఫ్యాన్స్ షాక్!

అలా సేకరించిన గెలలను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ కంపెనీకి తరలిస్తున్నారు. దీంతో అసలు సమస్య మొదలవుతుంది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో కలెక్షన్ల సెంటర్లలో రైతుల నుంచి గెలలు తీసుకునే సమయంలో ఒక్కో గెల ఉదాహరణకు 10 కిలోలు ఉంటే.. పతాంజలి కంపెనీ ప్రతినిధులు వాటిని ఖమ్మం జిల్లాకు తరలించి అక్కడ విక్రయించే సమయానికి కిలో వ్యత్యాసం వస్తున్నట్టు తెలుస్తోంది.

దీంతో రైతులు పతాంజలి కంపెనీ ప్రతినిధులకు ఆయిల్ ఫామ్ గెలలు ఇచ్చే సమయంలో 10 కిలోలో ఉంటే.. 9 కిలోలకే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నారు. ఫలితంగా రైతులు నష్టపోతున్నారు. ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ ఫామ్ కంపెనీలను ఏర్పాటు చేయాలని ఆదేశించినా.. పతాంజలి కంపెనీ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.

సాగులో కంపెనీ సపోర్టు నిల్..
ఆయిల్ ఫామ్ సాగు అనేది స్థానిక రైతులకు కొత్త పంట. ఈ పంటను ఏలా సాగు చేయాలనే దానిపై రైతులకు ఏమాత్రం అవగాహన లేదు. దీంతో సదరు ప్రైవేటు కంపెనీ యాజమాన్యమే తమ ప్రతినిధుల ద్వారా రైతులకు ఆయిల్ ఫామ్ సాగులో సపోర్టుగా నిలవాల్సి ఉంటుంది. కానీ కంపెనీ ప్రతినిధులకు పెద్దగా అవగాహన లేకపోవడం రైతులకు ఉపయోగం ఉండడం లేదు. నిజానికి ఆయిల్ ఫామ్ సాగు ఉద్యానవన శాఖ పరిధి కిందకు వస్తుంది.

హార్టికల్చర్ డిప్లొమా గానీ అంతకుమించిన పైచదువులు చదివిన వారిని తీసుకుంటేనే క్షేత్రస్థాయిలో రైతులకు యూజ్ ఉంటుంది. కానీ పతాంజలి కంపెనీ యాజమాన్యం నార్మల్ డిగ్రీలు చేసిన వారిని ఉద్యోగులుగా నియమించుకోవడంతో వారు రైతులకు అవగాహన కల్పించడంలో విఫలం అవుతున్నారు.

 Also Read: Ancient vs Modern Marriage: పెళ్లి నిశ్చయం కావాలంటే.. ఇంట్లోకి తొంగి చూడాల్సిందే.. అసలెందుకంటే?

దీనికితోడు ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నా.. ఉద్యానవన శాఖ అధికారులు నియోజకవర్గానికి ఒకరు మాత్రమే ఉండడంతో సకాలంలో రైతులకు అండగా నిలవడం సాధ్యం కాట్లేదు. దీంతో ఆయిల్ ఫామ్ సాగుపై రైతాంగానికి సవాలక్ష అనుమానాలు లేకపోలేదు. పదేండ్లుగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో ఇదే తంతు నడుస్తున్నా.. ఉన్నతాధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు