Maoists Surrender: ఫలించిన స్పెషల్ ఆపరేషన్.. 86 మంది
Maoists Surrende [image credit: swetcha reporter]
ఖమ్మం

Maoists Surrender: ఫలించిన స్పెషల్ ఆపరేషన్.. 86 మంది మావోలు లొంగుపాటు..

Maoists Surrender: భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా మల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట శనివారం 86 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు.వీరంతా బీజాపూర్,సుఖ్మ జిల్లా కు చెందిన వారు.

మావోయిస్టు పార్టీ పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ.. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకిగా మారడంతో, పోలీసులు స్పేషల్ ఆపరేషన్ తలపెట్టారు. ఈ నేపథ్యంలో గత నాలుగు నెలల్లో భారీ సంఖ్యలో మావోయిస్టు సభ్యులు లొంగిపోయారు.

 Also Rad LB Nagar Crime: ఫ్రెండ్ బిడ్డపైనే కన్నేశాడు.. పదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

లొంగిపోయిన మావోయిస్టుల్లో 20 మంది మహిళలు, 66 మంది పురుషులు ఉన్నారు. గత నాలుగు నెలల్లో జిల్లా వ్యాప్తంగా 66 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. 203 మంది లొంగిపోయారు. లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు 25 వేల రూపాయల చెక్కును ఐజీ అందజేశారు.

ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ములుగు జిల్లా ఎస్పీ శబరీష్, పలువురు పోలీస్ అధికారులు ఉన్నారు. అజ్ఞాతాన్ని వీడండి.. జనజీవన స్రవంతిలో కలవండి. ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయ సహకారాన్ని అందిస్తాం.. అని సందర్భంగా పోలీసులు తెలిపారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..