Niharika Konidela Pink Elephant Pictures Committee Kurrollu Title Final
Cinema

Tollywood Industry: నిహారిక కొణిదెల సమర్పణలో రాబోతున్న మూవీ

Niharika Konidela Pink Elephant Pictures Committee Kurrollu Title Final: మెగా బ్రదర్‌ నాగబాబు గారాల కూతురు నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1 మూవీకి కమిటీ కుర్రోళ్లు అనే టైటిల్‌ను ఫైనల్‌ చేశారు. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ను సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ రిలీజ్‌ చేసి మూవీ యూనిట్‌కు కంగ్రాట్స్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద చేసిన తొలి మూవీ కమిటీ కుర్రోళ్లు.

ఉగాది సందర్భంగా టైటిల్ పోస్టర్ రిలీజ్‌ చేశాం. పోస్టర్ రిలీజ్‌ చేసిన హీరో సాయి దుర్గా తేజ్‌గారికి థాంక్స్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ , శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ వారు కలిసి ఈ మూవీని నిర్మించడం చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంది కొత్త వాళ్లతో మూవీ చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాం. సినిమాకు కమిటీ కుర్రోళ్లు అనే టైటిల్ పెట్టాం. అలాంటి టైటిల్ ఎందుకు పెట్టామనేది తెలియాలంటే మాత్రం మూవీని మిస్సవకుండా చూడాల్సిందే. యదు వంశీ ఈ మూవీతో దర్శకుడిగా ఇంట్రడ్యూస్‌ అవుతున్నారు. తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నామని ఆమె అన్నారు.

Also Read: 75వ సినిమాతో దావత్‌కి రెడీ అంటున్న మాస్ మహారాజా..!

కాగా, ఈ మూవీలో 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ని టాలీవుడ్‌కి ఇంట్రడ్యూస్‌ చేస్తున్నారు. ఈ మూవీ ఇటీవలే షూటింగ్‌ని కంప్లీట్‌ చేసుకుంది. కమిటీ కుర్రోళ్లు చిత్రంలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేశ్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేశ్, తేజస్వి రావు, టీనా శ్రావ్య,విషిక, షణ్ముకి నాగుమంత్రి నటిస్తున్నారు. సాయి కుమార్, గోపరాజు రమణ, బలగం జయరాం, శ్రీలక్ష్మి ,కంచరపాలెం కిశోర్, కిట్టయ్య, రమణ భార్గవ్, జబర్దస్త్ సత్తిపండు తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీకి అనుదీప్ దేవ్ బాణీలను అందిస్తున్నారు.

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు