Cyber Criminals Fraud [image credit: al]
హైదరాబాద్

Cyber Criminals Fraud: ఒకే ఒక్క కాల్.. రూ. 40 లక్షలు హాంఫట్.. ఆ తర్వాత?

Cyber Criminals Fraud: సైబర్​ క్రిమినల్స్ బారిన పడ్డ ఓ ప్రైవేట్​ ఉద్యోగి 47లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. కాగా, మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు ఇవ్వటంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు 40లక్షల రూపాయలను రికవరీ చేశారు. కోర్టు అనుమతితో ఆ మొత్తాన్ని బాధితునికి అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్​ లో నివాసముంటున్న ఓ ప్రైవేట్​ ఉద్యోగికి శుక్రవారం అపరిచిత వ్యక్తి నుంచి కాల్​ వచ్చింది. కాల్ చేయటానికి ముందే సదరు వ్యక్తి తన సహచరున్ని కాన్ఫరెన్స్​ లో పెట్టాడు. ఈ విషయం బాధితునికి తెలియదు.

ఇక, బాధితునితో మాట్లాడిన సైబర్​ క్రిమినల్​ మీ బ్యాంక్​ ఖాతాలను అప్​ డేట్​ చేయాల్సి ఉందని చెప్పాడు. ఇప్పుడు మీకు ఓటీపీ వస్తుంది, ఆ నెంబర్ చెప్పండన్నాడు. మోసగాడు చెప్పినట్టుగానే బాధితుని ఫోన్​ కు వాయిస్​ ఓవర్​ ద్వారా ఓటీపీ నెంబర్​ వచ్చింది. కాన్ఫరెన్స్​ కాల్​ లో ఆ నెంబర్​ విన్న సైబర్ క్రిమినల్​ సహచరుడు వెంటనే బాధితుని బ్యాంక్​ అకౌంట్​ ను హ్యాక్​ చేశాడు. అందులో ఉన్న 47లక్షల రూపాయలను తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు.

 Also Read: Saree @ Rs 9: వ్యాపారి కొంప ముంచిన ప్రకటన.. పోటెత్తిన మహిళలు.. ఇక అంతా రచ్చ రచ్చ!

అకౌంట్​ నుంచి 47లక్షలు ట్రాన్స్​ ఫర్​ అయినట్టు వచ్చిన మెసెజ్​ చూసిన బాధితుడు వెంటనే సైబర్​ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన సీఐ కే.మధుసూదన్​ రావు సంబంధిత బ్యాంక్​ నోడల్​ అధికారితో మాట్లాడారు. అప్పటికే సైబర్​ మోసగాళ్లు 7లక్షల రూపాయలను తమ ఖాతాలోకి ట్న్స్​ ఫర్​ చేసుకున్నారు. కాగా, సీఐ మధుసూదన్​ రావు మిగితా 40లక్షల రూపాయలను ఫ్రీజ్ చేయించారు.

నాంపల్లిలోని 12వ అదనపు ఛీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు మెజిస్ట్రేట్​ అనుమతితో ఆ డబ్బును బాధితునికి తిరిగి అప్పగించారు. వచ్చిన ఫిర్యాదుపై వెంటనే స్పందించి 40లక్షల రూపాయలు బాధితునికి తిరిగి చేర్చిన సీఐ మధుసూదన్​ రావు, అనూషతోపాటు సిబ్బందిని కమిషనర్​ సీ.వీ.ఆనంద్​ అభినందించారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ