Saree @ Rs 9 (Image Source: AI)
రంగారెడ్డి

Saree @ Rs 9: వ్యాపారి కొంప ముంచిన ప్రకటన.. పోటెత్తిన మహిళలు.. ఇక అంతా రచ్చ రచ్చ!

Saree @ Rs 9: మహిళలకు చీరలంటే ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొత్త చీర అందాన్ని తీసుకురావడంతో పాటు చుట్టు పక్కల వారి ముందు తమను ప్రత్యేకంగా నిలుపుతాయని వారు భావిస్తుంటారు. ఖర్చుకు వెనకాడకుండా చీరలను కొనుగోలు చేస్తుంటారు. వేల రూపాయలు ఖర్చు అవుతున్నా వెనకాడరు. అయితే చీరలపై మహిళలకు ఉన్న ఇష్టాన్ని ఓ వ్యాపారి తన ప్రమోషన్ కు వాడుకోవాలని భావించాడు. అయితే అది బెడిసి కొట్టి నెట్టింట వైరల్ గా మారింది.

రూ.9కే చీర..
తెలంగాణలోని వికారాబాద్ కు JLM షాపింగ్ మాల్ ను ఓపెన్ చేశారు. తన షాప్ ను ప్రమోట్ చేసుకునేందుకు మాల్ యజమాని ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. మహిళలకు ఎంతో ఇష్టమైన చీరలను రూ.9లకే ఇవ్వాలని నిర్ణయించాడు. ఈ విషయం స్థానిక మహిళలకు తెలిసేలా భారీ ప్రకటన సైతం ఇచ్చాడు. ఫలితంగా ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి అందరి మహిళలకు చేరింది.

Also Read: Telangana Group 1: గ్రూప్ 1 నియామకాలకు వీడిన అడ్డంకి.. త్వరలో సర్టిఫికెట్స్ పరిశీలన!

పోటెత్తిన మహిళలు
రూ.9కే చీర అని తెలియడంతో పెద్ద ఎత్తున మహిళలు ఆ మాల్ వద్దకు చేరుకున్నారు. వందలాదిగా వచ్చిన మహిళలను చూసి మాల్ సిబ్బంది ఖంగు తిన్నారు. వారిని కంట్రోల్ చేసేందుకు తీవ్ర అవస్థలు పడ్డారు. అప్పటికీ అందులో ఉన్న చీరలను కొంత మందికి ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో మహిళలు ఒక్కసారిగా ఆ చీరల కోసం పోటీ పడ్డారు. చీరను దక్కించుకునేందుకు ఒకరినొకరు తోసుకున్నారు.

రంగంలోకి పోలీసులు
పరిస్థితులు చేజారుతున్నట్లు కనిపించడంతో మాల్ యజమాని.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. జరిగినదంతా వారికి చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మహిళలను అదుపు చేసేందుకు యత్నించారు. షాపు వద్ద స్త్రీలను కంట్రోల్ చేసేందుకు బారికేడ్లను సైతం ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పరిస్థితులు అదుపులోకి రాలేదు. పైగా అక్కడకు వచ్చిన మహిళలు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!