ఖమ్మం స్వేచ్ఛ: University College in Kothagudem: అన్ని రకాల ఖనిజ నిక్షేపాలు ఉన్న జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా అని ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక ఖనిజనిక్షేపాలు ఉన్నందున చదువుకున్న యువతీ యువకులకు ఖనిజాలను వెలికి తీసే విధంగా అవగాహన కల్పించడానికి యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యాలయం కొత్తగూడెంలో ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి సమ్మతించారని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని మీడియా సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, పి ఓ బి రాహుల్, ఎస్పీ రోహిత్ రాజ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం వలన అనేక ఖనిజా నిక్షేపాలు ఉన్న మన కొత్తగూడెంలోని యువతి యువకులు, ఈ విశ్వవిద్యాలయం ద్వారా అవగాహన పెంచుకొని తెలంగాణకి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. భద్రాచలం దేవస్థానం భక్తులు అధిక సంఖ్యలో రావడానికి తక్కువ ఖర్చుతో పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి కొత్తగూడెంలో విమానాశ్రయం కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి కేంద్రమంత్రికి నివేదించడం జరిగిందని త్వరలో అనుమతులు వస్తాయనీ మంత్రి తెలిపారు.
Also Read: Collector Muzammil Khan: రైతన్నను మెచ్చుకున్న జిల్లా కలెక్టర్.. అసలు స్టోరీ ఇదే!
భద్రాచలంలో ఎక్కువ శాతం ఆదివాసి గిరిజనులు నివసిస్తూ ఉంటారని ఈ ప్రాంతానికి రైలు మార్గం కొరకు పాండురంగపురం నుండి మల్కనగిరి రైల్వే లైన్ కలుపుతూ 16 కిలోమీటర్లు సర్వే పూర్తి చేయడం జరిగిందన్నారు. సారపాక వరకు రైలు మార్గం పూర్తయితే భద్రాచలం భక్తులు రావడానికి సమయం కలిసి వస్తుందని, నేషనల్ హైవే అమరావతి నుండి జగదల్పూర్ వరకు అలాగే భద్రాచలం నుండి ఏటూరు నాగారం డబుల్ లైన్ రోడ్డు నిర్మాణం కొరకు సర్వే చేసి త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు.మన జిల్లాలో బిపిఎల్, హెవీ వాటర్ ప్లాంట్, జెన్కో,కె టి పి ఎస్ సంస్థలు ఉన్న మన జిల్లాలో నౌకాయానం ద్వారా ట్రాన్స్పోర్ట్ లేదన్నారు.
కాబట్టి సరుకులు రవాణా చేయడానికి నిర్మాణం చేపడుతున్న సమ్మక్క సారక్క బ్యారేజీ కాలేశ్వరం బ్యారేజీ పూర్తిస్థాయిలో నిర్మించి, రాజమహేంద్రవరం నౌకల ద్వారా ప్రయాణం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. భద్రాచలం దేవస్థానమును మరింత అభివృద్ధి దిశగా తీసుకు వెళ్లడానికి మాడవీధుల అడ్డంకి లేకుండా జిల్లా అధికారులు కృషి చేయడం వలన 34 కోట్లు ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఇంకా అవసరమైతే నిధులు అందజేస్తామని సీఎం ఒప్పుకున్నారని, ఆగమ శాస్త్ర పండితులతో చర్చించి టెంపుల్ అభివృద్ధి కొరకు ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు.
గిరిజన రైతుల పంట పొలాలకు నీటి సమస్య రాకుండా సకాలంలో అందించడానికి సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ ప్రాజెక్ట్, తుమ్మలచెరువు, మారేడుబాక వరకు కాలువల నిర్మాణం చేపట్టి దాదాపు 70 వేల ఎకరాలకు నీరు అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, త్వరలో జిల్లాలోని ఎత్తిపోతల పథకాలు కూడా పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల ఈ సందర్భంగా తెలిపారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/