Collector Muzammil Khan [image credit; swetcha reporter]
తెలంగాణ

Collector Muzammil Khan: రైతన్నను మెచ్చుకున్న జిల్లా కలెక్టర్.. అసలు స్టోరీ ఇదే!

Collector Muzammil Khan: పండ్లలలో లాభదాయక మామిడి పంటను అధికంగా రైతులు సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.  జిల్లా కలెక్టర్, కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామంలో బానోత్ లక్ష్మణ్ పండిస్తున్న కార్బైడ్ రహిత మామిడి పంటలను పరిశీలించారు.మామిడితోటలో లక్ష్మణ్, రైతులతో కలిసి కలెక్ర్ ముచ్చటించారు.

గతంలో ఏ పంటలు సాగు చేశారు, ఎంత విస్తీర్ణంలో పంట వేశారు, అంతర్ పంటల సాగు ఎమై‌నా ఉందా, మామిడి పంట సంవత్సరానికి ఎంత దిగుబడి వస్తుంది, నీటి వనరులు ఎలా ఉన్నాయి వంటి వివిధ అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మామిడి సాగు విధానం పంట అధిక దిగుబడి కి తీసుకుంటున్న చర్యలు మార్కెటింగ్ విధానాన్ని రైతును అడిగి తెలుసుకున్నారు .

 Also Read: Vandanapeta: గ్రూప్ 1 ఉద్యోగం సాధించిన రైతు కొడుకు.. మెరిసిన పేదింటి విద్య కుసుమం

మామిడి సాగుకు రైతులు ఆసక్తి చూపేందుకు చేపట్టాల్సిన చర్యలు వారికి ప్రభుత్వపరంగా అందించాల్సిన తోడ్పాటు వివరాలు అధికారులతో పాటు రైతును అడిగి తెలుసుకున్నారు. కార్పైడ్ రహిత మామిడి పండ్ల విక్రయం ద్వారా అధిక ఆదాయం పొందుతున్న వివరాలతో పాటు, కష్ట నష్టాలను రైతు లక్ష్మణ్ నాయక్ ను అడిగి తెలుసుకున్నారు. లక్ష్మణ్ ని ఆదర్శంగా తీసుకొని నేటి యువ రైతులు లాభదాయక పంటలపై ఆసక్తి చూపాలన్నారు.

గ్రామంలో ఉన్న రెవెన్యూ సమస్యలు వివరాలు తెలుసుకున్న కలెక్టర్ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను రైతులు స్వదినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట  డిడబ్ల్యూఓ రాంగోపాల్ రెడ్డి, మండల ప్రత్యేకాధికారి మధుసూదన్, ఏడీఏ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ సుధాకర్,సంబంధిత అధికారులు, పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు