Vandanapeta: వారిది రెక్కాడితేగాని డొక్కాడని పేద రైతు కుటుంబం తల్లిదండ్రుల కష్టం చూస్తూ పేరిగిన ఆ యువకుడు పట్టుదలతో చదివి గ్రూప్ 1 ఉద్యోగం సాధించి అనేక మంది తోటివారికి ఆదర్శంగా నిలిచారు.హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం ఫున్నెల్ గ్రామానికి చెందిన మహ్మద్ మహబూబ్ అలీ-శమీమ్ ల కుమారుడు విలాయత్ అలీ… వారి కుటుంబ పరిస్థితి వింటే కన్నీరు ఆగని దయనీయ పరిస్థితిని అధిగమించి ఆ పెదింట్లో విద్య కుసుమంలా వెలిశాడు విలాయత్ అలీ పట్టుబట్టి చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు.విలాయత్ అలీ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల ఎన్నియున్నా చదువు కొనసాగించాడు. చదువు పట్ల అతనికున్న మక్కువ, పట్టుదల అతనిని ఉన్నత స్థాయికి చేర్చాయి.
మామునూర్ ఓ ప్రైవేట్ పాఠశాలలో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసి వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలలో చదివి, తర్వాత హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేసి ఈసీఎస్ లో సాఫ్టువేర్ ఉద్యోగం పొందాడు. ప్రజా సేవ చెయ్యాలనే లక్ష్యంతో గ్రూప్ 1 పరీక్షల గురించి తెలుసుకున్న అతను, వాటికి సిద్ధం కావాలని నిర్ణయించుకున్నాడు. రాత్రింబవళ్లు కష్టపడి చదివి, పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో 86వ ర్యాంక్ బీసీ(ఈ) కేటగిరీలో మొదటి ర్యాంక్ సాధించాడు.
చక్కగా చదివి మా కొడుకు కుటుంభానికి, గ్రామానికి గొప్ప పేరు తెచ్చాడని తండ్రి మహబూబ్ అలీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడని నాకు ఐదుగురు సంతానంలో 4 గురు ఆడపిల్లలు అయిన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, పట్టుదలతో కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని కష్టపడితే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు అని తండ్రి మురిసిపోతున్నాడు.
ఆత్మీయ సన్మానం…
మండలంలోని ఫున్నెల్ గ్రామానికి చెందిన మహ్మద్ విలాయత్ అలీ రాష్ట్రంలో నే బీసీ(ఈ) కేటగిరీలో మొదటి ర్యాంక్ రాష్ట్ర స్థాయిలో 86వ ర్యాంక్ సాధించడం ఎంతో గర్వించదగ్గ విషయం అని ఫున్నెల్ గ్రామంలోని తన ఇంటి వద్ద ఉన్న విలాయత్ అలీని స్వయంగా తహసీల్దార్ విక్రమ్ కుమార్ తన కారుని ఫున్నెల్ గ్రామానికి పంపి తల్లిదండ్రులను విలాయత్ అలీని తీసుకు రావాలని కోరారు. వెంటనే స్పందించిన గ్రామ పెద్దలు తనని తీసుకొని తహసీల్దార్ కార్యాలయంకు వెళ్ళారు. ప్రతిభ కనబరిచిన మహ్మద్ విలాయత్ అలీ, అతని తండ్రిని సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ చిన్న వయసులో గ్రూప్ 1లో ఉద్యోగం సాధించడం గొప్ప విషయమని కొనియాడారు. ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం లభించిందని వీరిని స్ఫూర్తిగా తీసుకుని మండలంలోని యువకులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని తహశీల్దార్ కోరారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు