Karimnagar district (image credi:swetcha)
కరీంనగర్

Karimnagar district: ఎమ్మెల్యే వినూత్న ఆలోచన.. ప్రజలందరికి అక్కడే పరిష్కారం!

కరీంనగర్‌ బ్యూరో స్వేచ్ఛః Karimnagar district: సామాన్యులకు ఉన్నసమస్యలను ఎమ్మెల్యేకు చెప్పుకోవాలంటే అసాధ్యమైన పని అన్నట్లు ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నియోజకవర్గంలో ఏమారుమూల పల్లె నుంచి అయిన వెళ్లి ఎమ్మెల్యేను కలుదామంటే మనం పోయిన టైంకు సార్‌ ఉంటాడో లేదో తెలియదు ఒకవేళ ఉన్న అంత మందిలో మన సమస్య గుర్తించి చెప్పుకునే అవకాశం ఉంటుందో లేదో తెలియని పరిస్థితిలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ఆన్‌ వీల్స్‌ కార్యక్రమంలో పేరుతో గ్రామాలకు అధికారులతో కలిసి వెళ్లి సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేసే దిశగా కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు.

తెలంగాణ రాష్ర్టంలోనే ఒక ఎమ్మెల్యే వారానికి మూడు రోజుల పాటు గ్రామాల్లో పర్యటన కార్యక్రమం పెట్టుకోవడం విశేషం మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తన నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సరికొత్త ఆలోచన చేశారు. ఎమ్మెల్యే ఆన్‌ వీల్స్‌ పేరుతో ఈనెల డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి రోజున సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చూడుతున్నారు. వారంలో మూడు రోజుల పాటు ప్రజల మధ్య ఉండి వారి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకునే విధంగా ప్రణాళిక తయారు చేసుకున్నారు.

స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

మూడు రోజులు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో మూడు గ్రామాలను ఎంపిక చేసుకొని ఎమ్మెల్యేతో పాటు మండల స్థాయి అధికారులు కలిసి వెళ్లుతారు. గ్రామంలోని ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కారం అయ్యే సమస్యలను వెంటనే పరిష్కారిస్తారు. మండల స్థాయి అధికారుల స్థాయి కాకపోతే డివిజన్‌, జిల్లా స్థాయిలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లుతారు. సమస్య పరిష్కారానికి అవసరమైన మార్గాలను అన్వేషించి సమస్య పరిష్కారం అయ్యే వరకు ఫాలో ఆఫ్‌ చేస్తారు. మిగిలిన నాలుగు రోజులు గ్రామాల్లో వచ్చిన ఫిర్యాదులు వారి పరిష్కారానికి మార్గాలను అన్వేషిస్తారు.

ప్రత్యేక వాహనం..

ఎమ్మెల్యే ఆన్‌ వీల్స్‌ కార్యక్రమం కోరకు ఎమ్మెల్యే కవ్వంపల్లి ప్రత్యేకంగా ఒక వాహనం కొనుగోలు చేశారు. వాహనంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మండల స్థాయి అధికారులకు కావాల్సిన కంప్యూటర్‌, ప్రింటర్‌తో పాటు ఇతర వస్తువులను అందుబాటులో ఉంచారు. గ్రామానికి వెళ్లిన తరువాత దరఖాస్తులు స్వీకరించి వాటిని ఆన్‌లైన్‌ చేయడానికి ఏలాంటి ఇబ్బందులు రాకుండ ఏర్పాట్లు చేశారు.

ప్రత్యేక యాప్‌..

ఎమ్మెల్యే ఆన్‌ వీల్స్‌ కార్యక్రమం కూరకు ప్రత్యేక యాప్‌ తయారు చేయించారు. గూగుల్‌ ప్లేస్టోర్స్‌కు వెళ్లి ఎమ్మెల్యే ఆన్‌ వీల్స్‌ అని టైప్‌ చేసి యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని యాప్‌లో గ్రామంలోని సమస్య లేదా వ్యక్తిగత సమస్య అందులో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. యాఫ్‌లో నమోదు అయిన సమస్యను ఎమ్మెల్యే ఆన్‌ వీల్స్‌ కార్యక్రమంలో గ్రామానికి వచ్చినప్పుడు పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. యాప్‌లో నమోదు అయిన ప్రతి సమస్య ఫిర్యాదు ట్రాకింగ్‌ ఏర్పాటు చేశారు. ఫిర్యాదు ఏదశలో ఉందో ఎప్పటికప్పుడు సమాచారం తెలుస్తుంది.

తెలంగాణలో తొలిసారిగా మానకొండూర్‌ ఎమ్మెల్యే చేపట్టిన ఎమ్మెల్యే ఆన్‌ వీల్స్‌ కార్యక్రమం విజయవంతం అయితే తెలంగాణలోని మిగిలిన ఎమ్మెల్యేలకు ఆదర్శం కావడంతో పాటు అనుసరించడం తప్పని సరి అవుతుందని పలువురు భావిస్తున్నారు.

Also Read: Friendly Traffic Police: బైక్ ఆపిన పోలీస్.. ఒట్టేసి మరీ చెప్పిన బైకర్.. వీడియో వైరల్..

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?