Secunderabad railway station (Image Source: AI)
హైదరాబాద్

Secunderabad railway station: ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్ నుంచి రైళ్లు మళ్లింపు.. తెలుసుకోకుంటే చిక్కే!

Secunderabad railway station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పలు అభివృద్ధి పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అమృత్ భారత్ స్టేషన్ పథకం (AMRIT BHARAT STATION SCHEME)లో భాగంగా కేంద్ర రైల్వేశాఖ.. సికింద్రాబాద్ స్టేషన్ రూపురేఖలను మార్చేస్తోంది. రూ.కోట్ల రూపాయల వ్యయంతో స్టేషన్ ఆధునీకరణ పనులు ప్రారంభించింది. ఈ క్రమంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడే సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక నిర్ణయం తీసుకుంది. పలు రైళ్ల రాకపోకల్లో స్వల్ప మార్పులు చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

10 రైళ్ల బోర్డింగ్ లో మార్పు

ఓవైపు ప్రయాణికుల రద్దీ.. మరోవైపు అభివృద్ధి పనుల దృష్ట్యా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చే రైళ్ల విషయంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు 10 రైళ్ల బోర్డింగ్ పాయింట్ ను మారుస్తూ దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రకటన విడుదల చేసింది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే రైళ్లను.. కాచిగూడ, ఉందానగర్, మాల్కాజిగిరి, హైదరాబాద్ (నాంపల్లి), చర్లపల్లి స్టేషన్లకు మారుస్తున్నట్లు  రైల్వేశాఖ వెల్లడించింది. ఈ మార్పులు తాత్కాలికమేనని అభివృద్ధి పనులు పూర్తయ్యాక తిరిగి యథావిధిగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఆయా రైళ్లు ప్రారంభమవుతాయని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.

Also Read: TG Intermediate calendar: విద్యార్థులకు గుడ్ న్యూస్.. 139 రోజులు సెలవులు.. ఇంటర్ బోర్డ్ కీలక ప్రకటన

ఈ రైళ్ల రాకపోకల్లో మార్పులు

❄️ విజయవాడ – సికింద్రాబాద్ మధ్య శాతవాహన ఎక్స్ ప్రెస్ (Sathavaahana Express) ప్రతీ రోజూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇకపై ఆ రైలు సికింద్రాబాద్ నుంచి కాకుండా కాచీగూడ నుంచి ప్రారంభం కానుంది. విజయవాడలో ఉ. 6.25కు ఆ రైలు బయలుదేరి మ.12.55 కాచిగూడకు చేరుకుంది. మళ్లీ సా.4 గం.లకు కాచిగూడ నుంచి స్టార్ట్ అయ్యి రా.10.15కు విజయవాడకు చేరుకుంటుంది.

❄️ సికింద్రాబాద్ నుంచి యశ్వంత్‌పుర (12735/12736) వెళ్లే సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ (Secunderabad Express) చర్లపల్లి టెర్మినల్ (Charlapally Terminal) నుంచి బయల్దేరనుంది. అయితే ఈ రైలు సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా యశ్వంత్ పురకు వెళ్లనుండటం గమనార్హం.

❄️ పుణే-సికింద్రాబాద్ (12025/12026) మధ్య తిరిగే పుణే ఎక్స్ ప్రెస్ (Pune Express) ట్రైన్ ను నాంపల్లి స్టేషన్ కు ఛేంజ్ చేశారు.

❄️ సికింద్రాబాద్ నుంచి మణుగూరుకు వెళ్లే సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ (12745/12746) చర్లపల్లి నుంచి స్టార్ట్ కానుంది.

❄️ పోరుబందర్-సికింద్రాబాద్ (20968/20967) మధ్య నడిచే పోరు బందర్ ఎక్స్ ప్రెస్ బోర్డింగ్ పాయింట్ లోనూ మార్పు చేశారు. ఆ రైలు కాచిగూడా మీదుగా ఉందానగర్ వరకూ ప్రయాణించనుంది.

❄️ సిద్దిపేట – సికింద్రాబాద్ మధ్య నడిచే డెము ట్రైన్.. సికింద్రాబాద్ కు బదులుగా మాల్కాజిగిరి నుంచి మెుదలుకానుంది.

❄️ సికింద్రాబాద్ నుంచి రేపల్లె మధ్య నడిచే సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ (17645/17646), సిల్చార్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ (12514/12513), సికింద్రాబాద్-దర్బంగ (17007/17008) సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ చర్లపల్లి నుంచి బయల్దేరనున్నాయి.

Also Read This: Online Betting Gang: బెట్టింగ్ రక్కసి గుట్టు రట్టు.. 16 మంది అరెస్ట్.. వెలుగులోకి సంచలన నిజాలు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!