Online Betting Gang (Image Source: Twitter)
క్రైమ్

Online Betting Gang: బెట్టింగ్ రక్కసి గుట్టు రట్టు.. 16 మంది అరెస్ట్.. వెలుగులోకి సంచలన నిజాలు

Online Betting Gang: బెట్టింగ్ రక్కసిపై తెలంగాణ పోలీసులు (Telangana Police) ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. బెట్టింగ్ ముఠాలకు చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీ (Telanaga Assembly) సాక్షిగా కంకణం కట్టారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం (Telangana Congress Govt) తరపున ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) సైతం ఏర్పాటు చేయనున్నట్లు శాసనసభలో ప్రకటించారు. దీంతో బెట్టింగ్ ఆగడాలపై మరింత దృష్టి సారించిన పోలీసులు.. తాజాగా ఓ భారీ ముఠాను పట్టుకున్నారు. సంచలన విషయాలను వెల్లడించారు.

16 మంది అరెస్ట్
నిజామాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్నా ముఠాను పోలీసులు అరెస్టు (Nizanabad Police) చేశారు. మెుత్తం 16 మంది నిందితులను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ పోలీసు కమీషనర్ సాయి చైతన్య  (Nizanabad CP Sai Chaitanya) మీడియాకు వెల్లడించారు. ఆర్మూర్ లోని ఐదో టౌన్ తో పాటు భారతి రాణి కాలనీలో ఈ రెండు ముఠాలు బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్లు చెప్పారు. వారు దాదాపు 1000 మందిని బెట్టింగ్ ఊబిలోకి దింపినట్లు తెలిపారు. 7 శాతం కమీషన్ తో బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ముఠా వల్ల 200 మంది మోసపోయినట్లు సీపీ చెప్పారు.

5వేల లావాదేవీలు
16మందితో కూడిన ఈ బెట్టింగ్ ముఠా దాదాపు.. 5000 వేల లావాదేవీలు జరిపినట్లు సీపీ సాయి చైతన్య స్పష్టం చేశారు. ఈ బెట్టింగ్ కేసుకు సంబంధించి 56 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 9 సెల్ ఫోన్లు , 34 ద్విచక్ర వాహనాలు, బ్యాంక్ పాస్ బుక్ లు , క్రెడిట్, డెబిట్ కార్డులను సీజ్ చేసినట్లు వివరించారు. నిందితులపై ఐటీ, గేమింగ్, మనీ లాండరింగ్ చట్టాల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు వివరించారు.

Also Read: TG Intermediate calendar: విద్యార్థులకు గుడ్ న్యూస్.. 139 రోజులు సెలవులు.. ఇంటర్ బోర్డ్ కీలక ప్రకటన

ఈజీ మనీ కోసమే..
నిందితులు ఈజీ మనీ కోసం.. ఈ బెట్టింగ్ కార్యాకలాపాలు నిర్వహిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. ఏ1 నిందితుడిగా షేక్ ముజీబ్ అహ్మద్ ను చేర్చినట్లు చెప్పారు. ఏ 2 షకీల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని అతడి కోసం గాలిస్తున్నట్లు సీపీ తెలిపారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు చెందిన సచిన్ అనే వ్యక్తి ఈ బెట్టింగ్ ముఠాకు మాస్టర్ గా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతడు బెట్టింగ్ పట్ల ఆసక్తి ఉన్న వారిని బుకీలు (ఏజెంట్)గా ఏర్పాటు చేసుకొని వారి ద్వారా అమాయకులను మోసం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

యువత.. జాగ్రత్తా
బెట్టింగ్ మోసాల మాయలో పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సీపీ సూచించారు. కష్టపడి ఉన్నత శిఖరాలకు ఎదగాడని సూచించారు. ఇన్ ఫ్లూయెన్సర్లు చెప్పారని సోషల్ మీడియా లింకులను క్లిక్ చేస్తే బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని హెచ్చరించారు. బెట్టింగ్ నిర్వాహకుల వల్ల మోసపోయిన వారు ధైర్యంగా ముందుకు రావాలని, వారికి పోలీస్ శాఖ అండగా నిలుస్తుందని సీపీ స్పష్టం చేశారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు