Chikoti Praveen: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర వివాదస్పదమైన వ్యక్తుల్లో క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ (Chikoti Praveen) ఒకరు. అప్పట్లో జరిగిన ఈడీ సోదాలతో ఒక్కసారిగా అతడి పేరు మార్మోగింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు చికోటి ప్రవీణ్ తో చీకటి బాగోతం నడిపారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. దీంతో అందరి దృష్టి ఒక్కసారిగా ప్రవీణ్ పై పడింది. ఈ క్రమంలోనే తాజాగా హెచ్ సీయూ (HCU) భూముల విషయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy)పై విమర్శలు చేసి ఆయన వార్తల్లో నిలిచారు. ఇదిలాఉంటే తాజాగా చికోటి ప్రవీణ్ కు ఊహించిన ఘటన ఎదురైంది. ఆయన ఆఫీసులో అనుమానస్పద వ్యక్తి హల్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని నందగిరి హిల్స్ వద్ద ఉన్న చికోటి ప్రవీణ్ ఆఫీసుకు తాజాగా ఓ గుర్తుతెలియని వెళ్లారు. చెడు దోషాలను తొలగిస్తానని చెప్పి చికోటి ప్రవీణ్ ను మోసం చేసే ప్రయత్నం చేశారు. ప్రమాదంలో ఉన్నారంటూ రైస్ పుల్లర్ ను పట్టుకొచ్చిన దండగుడు.. అది కొంటే కాబోయే సీఎం మీరేనంటూ మాయమాటలు చెప్పాడు. మోసాన్ని పసిగట్టిన ప్రవీణ్.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇందుకు సంబంధించి ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశారు.
యువత జాగ్రత్త
మాయమాటలు చెప్పి మోసం చేసేవారు సమాజంలో చాలా మంది ఉన్నారని చికోటి ప్రవీణ్ అన్నారు. ముఖ్యంగా యూత్ ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. గత రెండ్రోజుల నుంచి తనకు కాల్స్ వస్తున్నాయని.. విషయం చెప్పకుండా కలవాలని పదే పదే దుండగుడు కోరినట్లు చికోటి ప్రవీణ్ తాజా వీడియోలో తెలిపారు. ఏంటని ఆరా తీయగా రైస్ పుల్లర్ పేరుతో మోసం చేసేందుకు యత్నించాడని చెప్పారు. నిందితుడిది ఏపీలోని చీరాల అని తెలియజేశాడు. ఈ క్రమంలో దుండగుడి టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారొచ్చి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Heavy Rains in Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. ఇద్దరు మృతి
ఎవరీ చికోటి ప్రవీణ్
చికోటి ప్రవీణ్ విషయానికి వస్తే.. 20 ఏళ్ల క్రితం అతడు చిన్న సిరామిక్ టైల్స్ వ్యాపారి. హైదరాబాద్ (Hyderabad) సైదాబాద్ లోని వినయ్ నగర్ కాలనీలో వ్యాపారిగా తన కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత నిర్మాతగా మారి భారీ నష్టపోయాడు. కొన్ని సినిమాల్లో విలన్ గా సైతం అతడు నటించాడు. ఈ క్రమంలోనే ఓ డాక్టర్ ను కిడ్నాప్ చేసిన కేసు కూడా అతడిపై ఉంది. ఆ తర్వాత గోవా వెళ్లిన చికోటి ప్రవీణ్.. అక్కడి పేకాట క్లబ్ లో కొన్ని టేబుళ్లను అద్దెకు తీసుకున్నాడు. అలా పేకట నిర్వహిస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. ఒక క్యాసినో సామ్రాజ్యాన్నే స్థాపించారు.