Heavy Rains in Hyderabad (Image Source: Canva)
హైదరాబాద్

Heavy Rains in Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. ఇద్దరు మృతి

Heavy Rains in Hyderabad: హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. భారీగా కమ్ముకున్న కారుమబ్బులతో నగరమంతా ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, గచ్చిబౌలి, సచివాలయం, మాదాపూర్, ఆబిడ్స్, నాంపల్లి, పటాన్ చెరు, లింగంపల్లి, సికింద్రాబాద్ లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని రోడ్లపై నీరు నిలిచింది. భారీగా ట్రాఫిక్ జామ్ సైతం ఏర్పడింది. కాగా సాయంత్రం 5 గం.ల లోపు భారీ వర్షం కురవొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఎక్కడ ఎంత వర్షపాతమంటే?
హైదరాబాద్ లో గంటపాటు కురిసిన భారీ వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాలు వర్షపు నీటిలో నిలిచిపోయాయి. హిమాయత్ నగర్ లో అత్యధికంగా 7.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్, చార్మినార్ లో 7.5 సెంటీమీటర్లు.. అంబర్ పేట్ లో 7.2 సెంటీమీటర్లు.. బాలానగర్ లో 7 సెంటీమీటర్లు.. సరూర్ నగర్ – నాంపల్లి లో 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ఖైరతాబాద్ లో 6.2 సెంటీమీటర్లు.. సీతాఫల్ మండిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం పడినట్లు అధికారులు తెలిపారు. వర్షం కారణంగా ఇబ్బందులు ఎదురైతే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కి కాల్ చేయాలని అధికారులు సూచించారు. 040- 21111111 టోల్ ఫ్రీ నెంబర్ ను సైతం ఇచ్చారు.

సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
హైదరాబాద్​ నగరంలో భారీ వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రోడ్ల పై నీటి నిల్వలు లేకుండా ట్రాఫిక్ స‌మ‌స్య‌, విద్యుత్ అంత‌రాయాలు లేకుండా జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, విభాగాలు సమన్వయం తో పని చేయాలని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయిన ప్రాంతాల్లో వెంట‌నే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి విద్యుత్ స‌ర‌ఫ‌రాను పున‌రుద్ధ‌రించాల‌ని చెప్పారు.

యుద్ధప్రాతిపదికన చెట్ల తొలగింపు
హైదరాబాద్ లో ఈదురు గాలులతో కూడిన వర్షానికి పలు ప్రాంతాల్లో చెట్లు నెలకొరిగాయి. దీంతో హైడ్రా DRF బృందాలు యుద్ధ ప్రాతిపదికన తొలగింపు చర్యలు చేపట్టాయి. వృక్షాలు పడిన ప్రాంతాలను, నీరు నిలిచిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు నేరుగా పరిశీలించారు. ఖైరతాబాద్ సోమాజిగూడ RTA కార్యాలయానికి చేరువలో రోడ్డుకు అడ్డంగా పడిన వృక్షాన్ని 40 నిమిషాల్లో అక్కడి DRF బృందాలు తొలగించాయి. సైదాబాద్ స్టేట్ బ్యాంక్ కాలనీ, బషీర్బాగ్, నెక్లెస్ రోడ్డు, ముషీరాబాద్, అసెంబ్లీ రోడ్డు, బంజారాహిల్స్ తదితర ప్రాంతాలలో కూడా రోడ్డు కు అడ్డంగా పడిన వృక్షాలను తొలగించాయి. ఓల్డ్ అల్వాల్, ఎల్ బీ న గర్, బేగంపేట, మాదాపూర్, మేహిది పట్నం లోని NMDC వద్ద మోకాళ్లకు పైగా నిలిచిపోయిన వరద నీటిని హైడ్రా DRF బృందాలు తొలగించాయి.

పలు జిల్లాల్లో వాన
హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వర్షం కురిసింది. ఉమ్మడి మెదక్ జిల్లాల్లో మోస్తరు వాన పడింది. సంగారెడ్డి, సిద్ధిపేట, మెదక్ జిల్లాల్లో ఒక్కసారిగా కురిసిన వర్షంతో ప్రజలు ఉపశమనం పొందారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో 4.7 సెం.మీ.. మెదక్ జిల్లా శివంపేటలో 2.5 సెం.మీ.. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో 2 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది.

Also Read: AP Cabinet Meeting: ఏపీ కేబినేట్ లో పాస్టర్ మృతిపై చర్చ.. 9 అంశాలకు మంత్రివర్గం ఆమోదం

పిడుగుపాటుకు ఇద్దరు మృతి
నాగర్ కర్నూల్ జిల్లాలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. పిడుగు పడి పదర మండలం కోడోని పల్లి గ్రామంలో ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు. పొలం పనులకు వెళ్లిన సుంకరి సైదమ్మ (35) ఈదమ్మ (55) పిడుగు పాటుకు మృతి చెందారు. ఈ ఘటనలో మరో మహిళ సుంకరి లక్ష్మమ్మకు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు