Amberpet Urban Community Health: అంబర్ పేట పట్టణ సామాజిక ఆరోగ్య కేంద్రంలో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణ పనులను త్వరగా చేపట్టాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. అంబర్ పేట్ ఎంసీహెచ్ కాలనీ లోని పట్టణ సామాజిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవల కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణీలతో ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా?అని అడిగి తెలుసుకున్నారు.
Also read: Chit Fund Fraud: చిట్టీల పుల్లయ్య ఇంట్లో పోలీసుల తనిఖీలు.. సోదాలో బైటపడినవి ఇవే..
ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్, ఇంజక్షన్ రూమ్ కరకి చేసి రిజిస్టర్ లను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన 30 పడగల ఆసుపత్రి భవన నిర్మాణ పనులను త్వరగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆవరణలో ఉన్న చెట్లను వేరే చోటికి తరలించాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ను సూచించారు. ఆస్పత్రి ప్రక్కన గల భవన యజమానులు ఆస్పత్రి ఆవరణలో చెత్త వేసే వారిపై పెనాల్టీ వేయాలని, వినకపోతే క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆసుపత్రిలో ఉన్న అక్సిజన్ ప్లాంటు పని చేసేలా సరైన చర్యలు తీసుకోవాలని డీసీహెచ్ఎస్ ను ఆదేశించారు. ఆస్పత్రిలో సానిటేషన్ మెరుగ్గా ఉండేలా జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి, డి సి హెచ్ ఎస్ రాజేందర్, ఆర్డీవో రామకృష్ణ, డీఈఈ జగదీష్ ప్రసాద్, శివ ప్రసాద్, మెడికల్ ఆఫీసర్ దక్షిని, రేంజ్ ఆఫీసర్ అరుణ తదితరులు పాల్గొన్నారు.