కొత్తగూడెం స్వేచ్ఛ: Koneru Satyanarayana: గచ్చిబౌలిలో అంతర్జాతీయ సంస్థలు తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సిఎం రేవంతర్ రెడ్డి తాపత్రయ పడుతున్నారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ అన్నారు. కొంత మంది రాజకీయ కుట్రతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీలో ఇంచు భూమిని సైతం ముట్టుకోమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. చుంచుపల్లి మండలంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అబద్ధాల మీద బతుకుతున్న కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తూ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 400 ఎకరాల యూనివర్సిటీ భూమిని ప్రభుత్వం లాగేసుకుంటున్నట్లు దుష్ప్రచారం జరుగుతోందని, వాస్తవాలు ప్రజలకు తెలియాలని స్పష్టం చేశారు. 2004లో 400ఎకరాలను ఐఎంజీ భారత్‌కు అప్పటి ప్రభుత్వం అప్పగించిందని, దానికి బదులుగా అప్పటి ప్రభుత్వం గోపన్‌పల్లిలోని 397 ఎకరాలు హెచ్‌సియూకి ఇచ్చిందని గుర్తుచేశారు.
Also Read: Vanasthalipuram FCI Colony: నిధులు తెచ్చింది మేము.. శంఖుస్థాపన మీదా? కార్పొరేటర్ ఫైర్
బిల్లీ రావుకు చెందిన ఐఎంజీ భారత్ అనే ఫ్రాడ్ కంపెనీకి ఇచ్చిన భూ ఒప్పందాన్ని 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు. ఆ సంస్థ కోర్టుకు వెళ్లగా ప్రజల ఆస్తి ప్రజలకే ఉండాలని ప్రభుత్వం పోరాటం చేసిందన్నారు. సిఎం రేవంత్ ప్రభుత్వం కొట్లాడి కేసు గెలిచిందని వెల్లడించారు. బిఆర్‌ఎస్ నాయకుడు వనమా స్థాయి మరిచి మాట్లాడుతున్నారని, రౌడీలు ఎవరో తెలుసని, అవినీతి, అక్రమాలకు పాల్పడ వాళ్ళ గురించి ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు.
దళితబంధు పేరిట రాంబంధువుగా మారి అమాయక దళిత ప్రజలను మోసం చేసిన చరిత్ర మీదని విమర్శించారు. కొడుకు అక్రమాలకు కుటుంబాలే బలయ్యాయని, కాంగ్రెస్ భిక్షతోనే నేడు ఈ స్థాయిలో ఉన్నారని మరవకూడదని హితవు పలికారు. సరిగ్గా నాలుగు అడుగులు నడవలేరు, నాలుగు మాటలు మాట్లాడలేని స్థితిలో ఉన్న మనమా సిఎం రేవంత్ రెడ్డి పై వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవ చేశారు. ఇక మీద కాంగ్రెస్ పార్టీ పై బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఈ సమావేశంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు దేవిప్రసన్న, రైల్వే బోర్డు మెంబర్ వై శ్రీనివాస్ రెడ్డి, మండే హనుమంతరావు, జిల్లా యువనజ కాంగ్రెస్ అధ్యక్షుడు చీకటి కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.
Also Read: Gadwal District: ఆ బావి కోసం కలెక్టర్ ను కలిసిన రాజ వంశీయులు..