గద్వాల, స్వేచ్ఛ : Gadwal District: జోగులాంబ గద్వాల జిల్లా పురాతన కట్టడాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజ కుటుంబాలు (వారసులు) కొత్త బావిని పరిరక్షించాలని, పునరుద్ధరించాలని గత రెండు నెలలుగా జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయని గద్వాల పట్టణంలోని పురాతనమైన కొత్త బావిని, అన్ని కట్టడాలను సంరక్షించాలని జిల్లా కలెక్టర్ ను గద్వాల సంస్థానాధీశులు కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంబి సంతోష్ సంస్థానాధీశుల కుటుంబాలతో మాట్లాడుతూ పట్టణంలోని ఇతర బావుల్ని ఎలా సంరక్షించామో అదే మాదిరిగా కొత్త బావిని కూడా సంరక్షించి పర్యాటక కేంద్రంగా మారుస్తామని అన్ని విధాల అన్ని హంగులతో తిరిగి యదా స్థితికి వారం రోజుల్లో తీసుకువస్తామని ఆయన హామీనిచ్చారు.
సంబంధిత వ్యక్తితో మాట్లాడడం జరిగిందన్నారుఈ సందర్భంగా రాజ కుటుంబాల వారసులు విక్రమ సువాసినీ రెడ్డి, వెంకటకృష్ణారెడ్డి,వెంకటాద్రి రెడ్డి, విక్రమ్ సింహరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాజ కుటుంబాల మైన మేము ఏనాడు రాజా వంశస్థులకు చెందిన ఆస్తులను కట్టడాలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయలేదని ఏనాడో మా పెద్దలు వాటిని ప్రజల పరం చేశారని ఆ ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని తాము ఆటంక పరచలేదని అవి ప్రజలకు చెందాలని మేము భావిస్తున్నామని, పట్టణంలోని అనేక బావుల్ని ఇప్పటికే ఆక్రమించుకున్నారని మిగిలిన బావులను ప్రభుత్వం కాపాడాలన్నారు.. కొత్త బావి దగ్గర బావిని పూడ్చిన విధానాన్ని, మట్టిని చూసి ఇంత దారుణం జరుగుతుందని, ఈ బావిని పూడ్చడానికి వారికి ఎలా మనసు ఒప్పిందో వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
Also read: Medchal News: స్వేచ్ఛ కథనానికి స్పందన.. ఆ నిర్మాణాల తొలగింపు
ఇకనైనా ప్రజలు, ప్రజాప్రతినిధులు గద్వాల సంస్థానానికి ఉన్న అపురూపమైన బలమైన పురాతన కట్టడాలని సంరక్షించుకోవాలని సంరక్షించుకోకపోతే చరిత్ర మనల్ని క్షమించదని ఎవరు ఆక్రమించుకున్న వారు చరిత్ర హీనులుగా మిగిలిపోయే స్థితి రాకూడదని వారు తీవ్ర ఆవేదనని వ్యక్తం చేశారు.తమ పెద్దలు చేసిన గొప్ప పురాతన సంపదను కాపాడుకోలేక పోయామని మీరైనా కాపాడమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు గత రెండు నెలలుగా జరుగుతున్న ఈ పరిణామం తమను ఎంతో కలిసివేసిందని ఇక ఈ వివాదానికి ముగింపు పలకాలని అందరికీ ఆవేదనతో విన్నవించారు.
ఈ మొత్తం కార్యక్రమాల్లో రాజ కుటుంబాల వెంట సీనియర్ సిటిజన్ ఫోరం పురాతన కట్టడాల పరిరక్షణ సమితి అధ్యక్షులు మోహన్ రావు అఖిలపక్ష కమిటీ జిల్లా అధ్యక్షుడు నాగర్ దొడ్డి వెంకటరాములు సిపిఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు బిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య సిపిఎం జిల్లా నాయకుడు నరసింహ, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు కేశవరెడ్డి ప్రజా సంఘాల నాయకుడు సాదిక్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.